central released gazette notification on AP locality

Central released gazette notification on ap locality

AP locality, 2014 june 2 to 2017 june 2, AP jobs and education, pranab on AP file, gazette notification on AP locality, ఆంధ్రప్రదేశ్ స్థానికత, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్, latest news, AP news

President sign on AP locality file. and nod for 376d amendments. central released gazette notification on AP locality

ఫ్లాష్... ఏపీ స్థానికతపై క్లారిటీ వచ్చింది

Posted: 06/10/2016 11:45 AM IST
Central released gazette notification on ap locality

కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికతపై కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ అంశంపై బంతి కేంద్రం కోర్టులో ఉందని ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, శుక్రవారం ఆ ఫైల్ పై రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు. ఆకాసేపటికే కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. 2014 జూన్ 2 నుంచి మూడేళ్లలోపు రాష్ట్రానికి తరలేవారికి మాత్రమే స్థానికత వర్తించనుంది. దీంతో స్థానికతతో అనే డిమాండ్ తో ఆగిపోయిన ఉద్యోగులు ఇప్పుడు ఖచ్చితంగా కదలాల్సిన పరిస్థితి వచ్చింది.  

నోటిఫికేషన్ ప్రకారం ఆర్టికల్ 371(డి) లో మార్పులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి ఫైల్ పై సంతకం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లలోపు అంటే జూన్ 2 2014 నుంచి 2017 జూన్ 2 వరకు ఏపీకి వెళ్లేవారందరికీ స్థానికత వర్తిస్తుంది. అంటే వారందరికీ అక్కడి విద్య, ఉద్యోగాలలో అవకాశం ఉంటుందన్నమాట. తెలంగాణ నుంచే కాదు, పొరుగు ప్రాంతాల నుంచి వెళ్లే వారికి కూడా ఈ స్థానికత వర్తిస్తుందని గెజిట్ లో కేంద్రం పేర్కొంది.

ఈ అంశంపై అక్టోబర్ 9న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయగా, సానుకూలంగా స్పందించిన హోంశాఖ ఆ ఫైల్ ను రాష్ట్రపతికి పంపగా, ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో జూన్ 27 నుంచి అమరావతి నుంచి పాలన కొనసాగించాలన్న ఏపీ ప్రభుత్వానికి మార్గం సుగమైంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles