గుత్తా లైన్ క్లియర్... క్యూలో మరికొందరు? | line clear for gutta join in TRS and more in que

Line clear for gutta join in trs and more in que

Nalgonda MP Gutta Sukhender Reddy, Gutta Sukhender Reddy TRS, vivek, vinod, suresh reddy, TRS targets congress, TRS T congress, టీ కాంగ్రెస్ ఖాళీ, గుత్తా టీఆర్ఎస్, వివేక్, వినోద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్, టీఆర్ఎస్ లోకి వలసలు, తెలంగాణ వార్తలు, తెలంగాణ రాజకీయాలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telangana news

Nalgonda MP Gutta Sukhender Reddy is all set to don the pink scarf. Few more leaders including vivek, vinod, suresh reddy ready to join.

గుత్తా లైన్ క్లియర్... క్యూలో మరికొందరు?

Posted: 06/10/2016 11:23 AM IST
Line clear for gutta join in trs and more in que

తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ కు భారీగా గండి పడనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, నల్గోండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కడం దాదాపు ఖరారయ్యింది. ఈ మేరకు గురువారం ఆయన, మరికొందరు నేతలతో కలిసి ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి మరీ కలిసోచ్చినట్లు సమాచారం. ఆయన కూడా మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, దివంగత ఎంపీ వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతావారి చేరికపై సంగ్ధిగ్ధం నెలకొన్నప్పటికీ గుత్తా చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరికిందని చెబుతున్నారు.

కాగా, అధికార పార్టీ చేపట్టిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన గులాబీ బాస్ ఇప్పటికే టీటీడీపీని ఖాళీ చేసేశారు. ఈ క్రమంలో భవిష్యత్తులో కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి ప్రమాదం ఉండకుండా, తెలంగాణలో తమకు ఎదురే లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారు. నెలరోజులుగా కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్న గుత్తా ఎట్టకేలకు టీఆర్ఎస్ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇదిలా ఉంటే మిగతా వారి చేరిక ప్రతిపాదనను ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉద్యమ సమయంలోనే కాంగ్రెస్ కు హ్యాండిచ్చి వివేక్, వినోద్ లు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. కానీ, సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు వారు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. తర్వాత వరంగల్ లోక్ సభ ఎన్నిక సందర్భంగా వివేక్ మళ్లీ టీఆర్ఎస్ లో చేరతారన్న ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ ను వీడేది లేదని ఆ సమయంలో ఆయన ప్రకటించుకున్నారు.

అయితే అంతర్గత కుమ్ములాటతో పార్టీ పతనమవుతున్న తరుణంలో ఇంకా కాంగ్రెస్ కొనసాగటం మంచిది కాదని వెంకటస్వామి తనయులు భావిస్తున్నారంట. మరోనేత కేఆర్ సురేష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో స్పీకర్ గా పనిచేశారు. వైఎస్ అనంతరం రాజకీయాల నుంచి దూరమైన ఆయన తిరిగి యాక్టివ్ అవుదామని భావిస్తున్నాడంట. దీంతో వీరంతా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం.  అయితే గుత్తాతోపాటుగానే వీరు చేరతారా లేక గ్యాప్ ఇచ్చి మారతారా అన్నదానిపై స్పష్టత లేదు. ఓ వారం అటు ఇటు అయినా వీరు పార్టీ మాత్రం ఖాయమని తెలుస్తోంది.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles