ముఖ్యమంత్రికి మావోలతో లింకులు లేవంట | odisha CM Naveen Patnaik not links with Maoists

Odisha cm naveen patnaik not links with maoists

odisha CM Naveen Patnaik, Naveen Patnaik links with maos, former Union Minister Braja Kishore Tripathy, Kishore Tripathy Naveen Patnaik, osidha news, national news, telugu news, latest news, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, నవీన్ పట్నాయక్ మావోలతో లింకులు, బ్రజా కిషోర్ నవీన్ పట్నాయక్, తెలుగు వార్తలు, రాజకీయాలు, జాతీయ వార్తలు, తాజా వార్తలు

odisha CM Naveen Patnaik not links with Maoists. A day after former Union Minister Braja Kishore Tripathy told reporters in New Delhi that Odisha’s ruling party-BJD had transferred Rs 45 lakh from its bank account to Maoist leader Sabyasachi Panda’s ICICI Bank account at Chhatrapur in Ganjam district, the Maoist leader today denied of having any such bank account and of receiving any such amount from the BJD.

ముఖ్యమంత్రికి మావోలతో లింకులు లేవంట

Posted: 06/08/2016 05:28 PM IST
Odisha cm naveen patnaik not links with maoists

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉత్తవేనని తేలింది. సమతా క్రాంతి దళ్ అధినేత, కేంద్రమాజీ మంత్రి బ్రజా కిషోర్ మంగళవారం ఈ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం పట్నాయక్ మావోయిస్టులను వాడుకున్నారని ఆయన ఆరోపించాడు. బీజేడీ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి మావోయిస్టులకు రూ. 45 లక్షలు ఇచ్చాడని ఆయన తెలిపాడు. అరెస్టైన మావోయిస్టు నాయకుడు సవ్యసాచి పాండా ఖాతాకు ఈ మొత్తం జమ చేసినట్లు ఆయన వెల్లడించాడు.

అయితే ఈ వ్యాఖ్యలపై మావోనేత సవ్యసాచి స్పందించాడు. బీజేడీ నుంచి తనకు డబ్బు అందిందన్న వార్త అవాస్తవమని కొట్టిపడేశాడు. బీజేడీ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి మనీ ట్రాన్స్ ఫర్ జరిగిందన్న వార్తలో నిజం లేదు. అసలు నాకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతానే లేదని చెప్పాడు. తనకుంది ఒకే ఒక అకౌంట్ అని, అది కూడా బెర్హమ్ జైలు అధికారి ఆధీనంలో ఉందని వివరించాడు. కాగా, తన భర్తకు బ్యాంకు ఖాతా లేదని పాండా భార్య మిలి పాండా తెలిపారు.

బీజేడీ ఎస్ బీఐ ఎకౌంట్  (10091755246) నుంచి పాండా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా(203601501728)కు చెక్కు రూపంలో(441630) డబ్బు చెల్లించినట్లు కిషోర్ ఆరోపించాడు. బీజేడీ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరుతో 2014, ఏప్రిల్ లో ఈ బదిలీ జరిగిందని చెప్పారు. ఒక్కపక్క మావోయిస్టులకు సాయం చేస్తూనే మరోపక్క వారిపై పోరుకు మరిన్ని నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ విషయమై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధాని మోదీకి ఓ లేఖ రాసినట్లు ఆయన వివరించాడు. కాగా, కిశోర్ ఆరోపణలను బీజేడీ అధికార ప్రతినిధి అమర్ సట్పతి అబద్ధమని తోసిపుచ్చారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles