బస్సు-లారీ ఢీ... 17 మంది దుర్మరణం | 17 lives lost in tamilnadu road accident

17 lives lost in tamilnadu road accident

tamilnadu road accident, Chennai-Bengaluru highway, Krishnagiri district, 17 died, కృష్ణగిరి జిల్లా, చెన్నై బెంగళూర్ హైవే, తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం, తాజా వార్తలు, తెలగు వార్తలు, latest news, telugu

17 lives lost in tamilnadu road accident. In a tragic road accident in Chennai-Bengaluru highway, at least 17 people were killed and another 23 were injured in Tamil Nadu’s Krishnagiri district on Friday afternoon.

బస్సు-లారీ ఢీ... 17 మంది దుర్మరణం

Posted: 06/03/2016 06:07 PM IST
17 lives lost in tamilnadu road accident

తమిళనాడులో జాతీయ రహదారి శుక్రవారం మృత్యు ఘోషతో మార్మోగింది. చెన్నై-బెంగళూరు రహదారిపై కృష్ణగిరి జిల్లా నేల్మలై వద్ద మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిచగా, ఏకంగా 17 మందిని మృత్యువాత పడ్డారు. మొత్తం 33 మందితో ఓ ప్రైవేట్ బస్సు బెరిగాయ్ నుంచి కృష్ణగిరికి వస్తోంది. అదే సమయంలో కర్ణాటక నుంచి వస్తున్న ఓ వేరుశనగా లోడు లారీ టైర్ హఠాత్తుగా పంక్చర్ కావటంతో అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం సమయంలో బస్సు వెనకాలే ఓ కారు ఆగి ఉండటంతో ప్రమాదంలో అది కూడా నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ఎంత మంది ఉన్నారో సరిగ్గా తెలియరావటం లేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనలో 17మంది అక్కడిక్కడే దుర్మరణం చెందగా, మరో 15మంది గాయపడ్డట్లు కృష్ణగిరి డీఎస్పీ కన్నన్ తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందట. ఓ 12ఏళ్ల బాలిక సహా ఆరుగురు మహిళలు మృతుల్లో ఉన్నట్లు ఆయన చెప్పారు. కాగా మృతుల వివరాలతో పాటు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ నెత్తుటితో భయానక వాతావరణం నెలకొంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamilnadu road accident  Chennai-Bengaluru highway  Krishnagiri district  

Other Articles