మాయావతికి నిద్రలేకుండా చేసిన వంటవాడు | Mayawati looking for Amit Shah's Cook

Mayawati looking for amit shah s cook

Amit Shah's cook, BSP, Mayawati, search for the cook, వంటవాడి కోసం వెతుకులాట, మాయావతి, అమిత్ షా, బీజేపీ చీఫ్, దళిత భోజనం, national news, political news, telugu news

Bahujan Samaj Party chief Mayawati has asked her cadres to "search for the cook" who prepared the food for Bharatiya Janta Party national president Amit Shah when he dined with Dalits during his visit to Jogiyapur village in Varanasi two days ago.

మాయావతికి నిద్రలేకుండా చేసిన వంటవాడు

Posted: 06/03/2016 05:50 PM IST
Mayawati looking for amit shah s cook

బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఓ వంటవాడు ఇప్పుడు నిద్రలేకుండా చేస్తున్నాడు. వీలైనంత త్వరంగా అతన్ని వెతికి పట్టుకోవాలంటూ కార్యకర్తలను ఆమె ఆదేశించింది. ఆమె ఏంటీ? వంటవాడు ఏంటీ? ఇంతకీ అతనేం చేశాడనేగా మీ అనుమానం. ఏం లేదు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి వండిపెట్టడమే అతను చేసిన నేరం. అందులో మాయావతికి జరిగిన ద్రోహం ఏంటంటారా? అక్కడికే వస్తున్నాం...

ఉత్తరప్రదేశ్ వారణాసి(ప్రధాని మోదీ నియోజకవర్గం)లోని జోగియాపూర్ లో జూన్ 1న బీజేపీ చీఫ్ అమిత్ షా దళితులతో కలిసి భోజనం చేసిన సంగతి తెలిసిందే. రైతుల ర్యాలీలో పాల్గొనేందుకు అలహాబాద్ వెళ్తున్న షా ఆ గ్రామంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ దళిత వర్గానికి చెందిన గిరిజా ప్రసాద్ బిండ్ కుటుంబంతో కలిసి ఆయన నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ విషయాన్ని ఫోటోలు తీసి మరీ బీజేపీ మీడియాకు అందజేసింది. అయితే యూపీలో అత్యధికంగా ఉన్న దళిత ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ ఈ డ్రామాలు ఆడుతుందని బీఎస్పీ విమర్శిస్తోంది.

నిజానికి కార్యక్రమానికి  250 మంది బీజేపీ నేతలు  హాజరయ్యారు. కానీ, వారిలో 50 మంది మాత్రమే భోజనం చేశారంట. పైగా ఎంపిక చేసిన ప్రదేశంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బింద్ కులస్తుల ఇంట్లో ఇది జరిగిందని ఆరోపిస్తోంది. మరి అలాంటప్పుడు దళితుల ఇళ్లలో భోజనం చేశామని చెప్పుకోవటం సబబేనా అని ప్రశ్నిస్తున్నాడు వారణాసి బీఎస్సీ నేత డాక్టర్ రామ్ కుమార్ కురేల్ . ప్రస్తుతం వంటమనిషి కోసం మా కార్యకర్తలు వెతుకుతున్నారు. దొరగ్గానే కమలనాథులు ఆడుతున్న నాటకం బయటపడుతుందంటున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆయన దళితులతో భోజనం చేశారంటూ యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్ మండిపడ్డారు. కాగా, షా భోజన వ్యవహరాన్ని రాజకీయం కోణంలో చూడటం దుర్మార్గమని బీజేపీ మండిపడుతోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah's cook  BSP  Mayawati  search for the cook  telugu news  

Other Articles