హాట్ ఫోటో తో ఛీట్ చేసింది | Amanda Holden cheating with fake bikini pic

Amanda holden cheating with fake bikini pic

Amanda Holden, instagram, bikini pic, photoshop edit, అమంద హోల్డెన్, ఇన్ స్టాగ్రామ్, బికీనీ ఫోటో, ఫేక్, తాజా వార్తలు, సినిమా వార్తలు, తెలుగు న్యూస్, latest news, movie news, entertainment, telugu news

Amanda Holden posted bikini photo in instagram. but fans claims that it was edited in photoshop. later this allegations she deleted that pic.

హాట్ ఫోటో తో ఛీట్ చేసింది

Posted: 06/02/2016 05:56 PM IST
Amanda holden cheating with fake bikini pic

కుర్రకారు పండగ చేస్కుంటారులే అని భావించిన ఆ నటి కమ్ మోడల్ కి పెద్ద దెబ్బ పడింది. ఎంతో ఆశగా టూ పీస్ బికినీతో ఓ హాట్ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చివరకు ఆమెకు అవమానం మిగిలింది. వివరాల్లోకి వెళ్లితే... హాలీవుడ్ నటి ఆమందా హోల్డెన్ ప్రస్తుతం ఓ షో కోసం కొత్త అవతారం ఎత్తింది. లండన్ లో జరుగుతున్న 'బ్రిటన్ గాట్ టాలెంట్' అనే ఒక ప్రత్యేక షో ఆమే న్యాయనిర్ణేత. ప్రస్తుతం ఆ షోకి సంబంధించి ఫైనల్ పోటీలు జరుగుతున్నాయి కూడా. అయితే కాస్త విరామం దొరకటంతో అలా సముద్రం ఒడ్డున విహరించింది. ప్రకృతిని ఆస్వాదించింది అంతటితో ఆగలేదు...

టూ పీస్ బికినీలో ఉన్న ఆమె ఓ ఫోజు ఇస్తే... కెమెరా మెన్ క్లిక్ మనిపించాడు. ఫోటో అద్భుతంగా వచ్చిందని భావించిన ఆమె దాన్ని తన అభిమానుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. ఇలా పోస్ట్ చేసిందో లేదో అలా టక టకా లైక్ లు,  కామెంట్లు వచ్చిపడ్డాయి. ఇంకోందరైతే ఏకంగా షేర్ లు చేసేసుకున్నారు. అయితే ఫోటోను నిశితంగా పరిశీలించిన కొందరు అభిమానులు మాత్రం తీవ్రంగా మండిపడ్డారు. అది ఫోటో షాప్ లో ఎడిట్ చేసిందంటూ తేల్చేశారు. తమ అభిమాన తార ఘోరంగా మోసం చేసిందంటూ ఫీలయ్యారు. వారి ఆరోపణలతో హర్టయిన ఆమె వెంటనే ఫోటో తొలగించింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amanda Holden  instagram  bikini pic  photoshop edit  telugu news  

Other Articles