కాబోయే టీ సీఎం వరాల జల్లు | Revanth asks about KCR's Farm House lands

Revanth asks about kcr s farm house lands

Telangana TDP working president, Revanth Reddy, KCR, farm house land, తెలంగాణ సీఎం, రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్ భూములు, తెలంగాణ వార్తలు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

Telangana TDP working president A Revanth Reddy today demanded chief minister K Chandrasekhar Rao to distribute his farm house land to farmers.

కాబోయే టీ సీఎం వరాల జల్లు

Posted: 06/02/2016 05:34 PM IST
Revanth asks about kcr s farm house lands

తెలంగాణ సర్కార్ తీసుకుంటోన్న ప‌లు నిర్ణయాలపై చిచ్చుబుడ్డిలా ఎగిరిండు తెలంగాణలో సైకిల్ సింగిల్ రథసారథి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరిచిపోకుండా మీడియాతో మాట మంతి కలిపిండు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఏటిగడ్డ కిస్టాపూర్ సర్పంచ్ సునందబాయ్ ముంపు బాధితుల తరుపున రిలే దీక్షలు చేపట్టిన సందర్భంగా రేవంతు తన వంతు సంఘీభావం తెలిపిండు. అక్కడికెళ్ళిన తర్వాత కేసీఆర్ గుర్తోచ్చాడు. ఓటుకు నోటు గుర్తోంచ్చింది. ఆ కోపంల ఆయన ఆస్తి పాస్తులు జ్ఞాపకం వచ్చాయి. ఎర్రపల్లిలో ఉన్న ఫాం హౌస్, అక్కడి ల్యాండ్ గుర్తుకొచ్చాయి. పబ్లిక్ గా ఒక ప్రపోజల్ విసిరాడు రేవంతప్ప. తానే కేసీఆర్ భూములకు రేటుకట్టేసేడు. ఎకరం పది లక్షలు అయితే తన జేబులోంచి ఆడబ్బు తీసి కొనేసి ముంపు బాధితుల కాలనీ నిమిత్తం సహకరించగలనంటుండు. ఇదేమి చోద్యం రేవంత్! సార్ ల్యాండ్ కి నువ్వే వెల కట్టేయడం వాటిని ఫలాన కాలనీ నిమిత్తం వెచ్చిస్తాననడం, అత్త సొమ్ము అల్లుడి దానంలా మనోడికే సొంతం.

పనిలో పనిగా రాష్ట్రం ఇంత‌కు ముందు టీజీ అనే సంక్షిప్త అక్షరాలతో పాపులర్ అయ్యిందనే విషయాన్ని యాది తెచ్చుకున్నాడు. కానీ, దాన్ని సంబంధం లేకుండా టీఎస్ గా మార్చేశార‌ని ఆవేదన వ్యక్తం చేశాడు.  త్వరలో(అంటే ఎప్పటికో తెల్వద్) టీడీపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తుంద‌ని, తదనంతరం టీఎస్ కి మార్చి పడేస్తామని అప్పుడే ఎన్నికల హామీ ఇచ్చేస్తున్నాడు. టార్గెట్ 99తో కాబోయే సీఎం తానేనంటూ సవాల్లు కూడా చేసేసిండు కదా. అలాంటప్పుడు మనోడు ఏంచేసినా మాట్లాడినా మీడియాకి పండగే, ప్రజలకు దండగే! మిగిలింది ఒక్కడేగా లింగు లింగు మంటూ మనుకుంటూ ఏం మాట్లాడినా చెల్లుతుందనే కాన్ఫిడెంట్ ఉంటే చాలు. ఛల్తా...


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana TDP working president  Revanth Reddy  KCR  farm house land  telugu news  

Other Articles