TDP MP malla reddy to join Ruling TRS officially today

Malla reddy to join trs

Malkajgiri MP Join TRS, MP Malla Reddy Join TRS, Malkajgiri MP Malla Reddy Join TRS, Telangana Formation Day, malla reddy, TDP malkajgiri MP, TDP, TRS, Educationalist

The lone Telugu Desam MP elected from Malkajgiri Parliamentary constituency in Telangana State, Ch Malla Reddy is likely to join TRS on Wednesday.

గ్రేటర్ లో టీడీపీ దుకాణం బంద్.. కారెక్కనున్న దేశం ఎంపీ..

Posted: 06/01/2016 09:27 AM IST
Malla reddy to join trs

సరిగ్గా రెండేళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్‌లో తన సత్తాను చాటుకున్న తెలుగుదేశం పార్టీ.. క్రమంగా పట్టుకోల్పోయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో చెప్పుకునేందుకు కూడా ఒక్క ప్రజాప్రతినిధి మినహా టీడీపీలో లేకపోవడంతో టీడీపీ దుకాణం రమారమి ఖాళీ అయ్యింది. పార్టీకి గ్రేటర్ హైదరబాద్ లో మిగిలిన ఏకైక ఎంపీ, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చామకూర మల్లారెడ్డి ఇవాళ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. ఇందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు ముహూర్తాంగా నిర్ణయించారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్‌ను కలుస్తారు. ఇక మల్లారెడ్డి సాదరంగా పార్టీలోకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అహ్వానించనున్నారు. అయన మెడలో గులాభి కండువా వేసి మరీ పార్టీలోకి చేర్చుకోనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మల్లారెడ్డి గతంలోనే టీఆర్ఎస్ చేరుతారన్న వార్తలు వినిపించాయి. ఆ తరుణంలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేఫ్ అయనను అడ్డుకున్నారని సమాచారం. అయితే ఇన్నాళ్లు ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు.

ఇప్పటికే 2014 సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ స్థానంతో పాటు ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కంటోన్మెంట్, జూబ్లిహిల్స్, సనత్‌నగర్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నెగ్గారు. వీరిలో ఒక్క ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మినహా మిగిలిన వారంతా ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆర్. కృష్ణయ్య సైతం తన బిసి సంక్షేమ సంఘం కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీఉనికి నామమాత్రంగానే మిగిలిపోనుంది. దీంతో ఇక టీడీపీ దుకాణం బంద్ అయ్యిందన్న విమర్శలు వినబడుతున్నాయి

ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన కార్యకర్తలు, పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు మాత్రమే తాను అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తన సొంత ప్రజలకు మరింతగా దగ్గరగా ఉండాలనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కోన్నారు. తన పార్లమెంటు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్ని మల్లారెడ్డి అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malla reddy  TDP malkajgiri MP  TDP  TRS  Educationalist  telangana formation day  

Other Articles