UP shocker: Umpire's sister poisoned and killed over no-ball decision

Umpire calls no ball sister poisoned

Rattan Pal Rawal, Jarara Premier League (JPL), game, match, sports, player, umpire, poison, sister, revenge, crime, Umpire Decision, no ball, Jarara village, khair tehsil, aligarh district, Uttar pradesh, Cricket, Cricket Controversies

Cricket claimed the life of an innocent 15-year-old girl form Jarara, a small town of Uttar Pradesh.

క్రికెట్ లో విషాదం.. అంపైర్ సోదరిని చంపిన క్రీకెటర్..

Posted: 05/31/2016 09:49 PM IST
Umpire calls no ball sister poisoned

క్రికెట్ అంటే క్రికెటే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. ఢిల్లీ నుంచి అమెరికా వరకు అన్ని దేశాలలో ప్రాముఖ్య స్థానాన్ని సంపాదించుకున్న క్రీడ. అంతర్జాతీయ క్రికెట్ లోనే వివాదాలకు తెరలేస్తున్న తరుణంలో గల్లీ క్రికెట్ లో ఏకంగా ఘర్షణలు కూడా చోటుచేసుకోవడం కామన్. అయితే ఈ క్రికెట్ లో కొత్త తరహా నేరాలు కూడా చోటుచేసుకోవడంతో యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలో గల జరారా పట్టణంలో క్రికెట్ టోర్నమెంటు సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది.

ఐపీఎల్ తరహాలోనే జరారా గ్రామంలో జరారా ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) పేరుతో ఓ టోర్నమెంటు నిర్వహించుకున్నారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5,100 ఇస్తామన్నారు. జరారా, బరికి జట్ల మధ్య జరుగుతున్న ఓ మ్యాచ్‌లో సందీప్ పాల్ అనే బౌలర్ వేసిన బాల్‌ను అంపైర్ రాజ్‌కుమార్ నోబాల్‌గా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాల్ కోరాడు. కానీ అంపైర్ తిరస్కరించడంతో, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపేస్తానని బెదిరించాడు. అయితే, రాజ్‌కుమార్ దాన్ని పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు.

సరిగ్గా మర్నాడే రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులంతా పొలానికి వెళ్లినపుడు సందీప్ పాల్ వాళ్లింటికి వెళ్లి, అక్కడున్న 15 ఏళ్ల పూజకు, ఆమె స్నేహితులు ముగ్గురికి కూల్‌డ్రింకులు ఇచ్చాడు. వాళ్లందరికీ అతడు తెలుసు కాబట్టి అనుమానం ఏమీ రాలేదు. విషం కలిపిన ఆ డ్రింకులను వాళ్లు తాగేశారు. కాసేపటికే పూజ కుప్పకూలింది. దాంతో ఆమెను, మిగిలిన ముగ్గురిని కూడా ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో ఒకరు మరణించగా మిగిలిన ముగ్గురినీ మెరుగైన చికిత్స కోసం అలీగఢ్‌లోని పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. సంఘటన స్థలంలోనే మరో పురుగుల మందు సీసా కూడా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles