Chinese mask factory is betting Donald Trump will be the next US president

Chinese factory gearing up for halloween with masks of trump

2016 US presidential election, china manufacturing, Donald Trump, Hilary Clinton, Jinhua Partytime Latex Art and Crafts Factory, mask making, masks, Osama bin Laden,

Despite Donald Trump’s China-bashing remarks in the US presidential campaign, one Chinese factory is betting on his victory, and aims to profit from it.

తిట్టినా నువ్వే.. మాకు నచ్చినా నువ్వే..

Posted: 05/30/2016 08:00 PM IST
Chinese factory gearing up for halloween with masks of trump

ఏ దేశానికి చెందినవాడైనా.. తమ దేశాన్ని ఎవరైనా కించపర్చే వ్యాఖ్యలు చేస్తే.. ఆయన ఎవరు.. ఏ స్థాయి అధికారంలో ఇలా వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎవరూ చూడరు. తమ దేశాన్ని కించపర్చేందుకు నైతిక హక్కు ఏమిటని ప్రశ్నించారు. ఇక మరికోందరైతే అవతలి వారి స్థాయిని కూడా మరచి తిట్టేస్తుంటారు. కానీ ఈ విషయంలో చైనా వాసుల రూటు మాత్రం సపరేటు. తమ దేశాన్ని బండబూతులు తిడుతున్నా వారిపై తమ దేశంలో వున్న డిమాండ్ దృష్ట్యా ఈ మాటలు అనాల్సివస్తుంది.

చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ దేశ దూకుడుకు ఎలాగైనా తాను కళ్లెం వేస్తానని మాటలు పేలిన అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు చైనాలో మాత్రం మంచి డిమాండ్ పెరుగుతోంది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తప్పక సాధిస్తారని మాస్క్లు (ముసుగులు) తయారు చేసే ఓ చైనా కంపెనీ యజమాని బెట్టింగ్లు కాస్తున్నాడు. ట్రంప్ గెలిచే అవకాశాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకుంటానని చెబుతూ ఇప్పటికే ట్రంప్ ముఖంలాంటి ముసుగులు వందల్లో తయారు చేసి సిద్ధంగా ఉంచాడు.

ఒక్క ట్రంప్ వే కాకుండా హిల్లరీ, సాండర్స్ మాస్క్లు కూడా తన మాస్క్ల ఫ్యాక్టరీలో ముందుచూపుతో తయారుచేయించాడు. చైనాలోని జిజియాంగ్ ప్రావిన్నస్లోగల లాటెక్స్ ఆర్ట్, క్రాఫ్ట్స్ ఫ్యాక్టరీకి ఒక ప్రముఖ మాస్క్ల తయారీ పరిశ్రమగా పేరుంది. ఇందులో ఒసామా బిన్ లాడెన్ నుంచి స్పైడర్ మేన్ వరకు రబ్బరుతో ముసుగులు తయారు చేస్తారు. ట్రంప్, హిల్లరీల ఒక్కో మాస్క్ ధర ఐదు డాలర్లుగా నిర్ణయించారు. ఒక్కో నేతకు దాదాపు అర మిలియన్ మాస్క్లు సిద్ధం చేస్తున్నారట. అయితే, ఈ పరిశ్రమ యజమాని మాత్రం ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తాడని, ట్రంప్ ముసుగులు వీలయినన్ని ఎక్కువగా తయారుచేయాలని కార్మికులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  China  masks Factory  

Other Articles