Tanmay Bhat's video: 'In comedy, you have to push that line'

Cops contact google facebook youtube to block tanmay bhat video

tanmay bhat, aib roast, aib video, all india bakchod, lata mangeshkar, sachin tendulkar, social media, tanmay bhat snapchat, sachin vs lata civil war, chetan bhagat, vishal dadlani, bollywood

A day after comedian Tanmay Bhat’s video of a mock conversation with veteran singer Lata Mangeshkar and cricketing legend Sachin Tendulkar sparked massive outrage on social media, some voices have come out in support of him and his freedom of speech.

అసభ్య వీడియోపై నెట్ జనుల భిన్నస్వరాలు..

Posted: 05/31/2016 09:23 AM IST
Cops contact google facebook youtube to block tanmay bhat video

దేశానికి చెందిన సెలబ్రిటీలు.. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా తమ సేవలతో మనన్నలు అందుకున్న వారిపై కామెడీ చేస్తూ.. దానిని సోషల్‌ మీడియాలో అప్ లోడ్ చేయడంతో దుమారం రేపుతున్న కమెడియన్‌ తన్మయ్‌ భట్‌ వీడియోపై ముంబై సైబర్‌ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  దీనిపై సోషల్ మీడియాలో నెట్ జనులు తీవ్రంగా మండిపడుతున్నారు. సెలబ్రిటీలను కించపర్చాలన్న ఉద్దేశ్యంతోనే తన్మయ్ భట్ ఈ తరహా కామెడీకి తెరలేపాడని వారు మండిపడుతున్నారు. తక్షణం ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని, లేదా బ్లాక్ చేయాలని డిమాండ్ అధికమయ్యింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ సెల్ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌, ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ల పట్ల అసభ్య హాస్యంతో ఉన్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడకుండా బ్లాక్ చేయాలంటూ గూగుల్‌, ఫేస్‌బుక్‌, యుట్యూబ్‌లను వారు అడిగారు. లతా, సచిన్‌ను అవమానపరిచేవిధంగా ఉన్న ఈ వీడియోను తొలగించాలని ఆదేశించారు.
 
ఇమిటేటింగ్ వాయిస్ తో లత, సచిన్ ముఖాలతో యూట్యూబ్ లో తన్మయ్ పోస్ట్ చేసిన వీడియోపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.  'లత: సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లి గొప్ప క్రికెటర్.. సచిన్: మీరు 5000 ఏళ్ల ముసలామెగా మాట్లాడుతున్నారు' అంటూ సంభాషణ సాగే  వీడియోలో 86 ఏళ్ల లతా ఇంకా ఎందుకు బతికి ఉందని అంటూ వెకిలీ హాస్యాన్ని చూపించారు. ఈ వీడియోపై ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడగా.. బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్‌ దీని రూపకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్‌బుక్‌లో, యుట్యూబ్‌లో ఈ వీడియో పెట్టిన తన్మయ్‌ భట్‌తోపాటు ఏఐబీ టీమ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన ఐపీ అడ్రస్‌ను తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ముంబై అసిస్టెంట్ పోలీసు కమిషనర్‌ యశ్వంత్ పాఠక్‌ విలేకరులకు తెలిపారు.

కాగా నాలుగు రోజుల తరువాత తన్మయ్ భట్ కు కూడా మద్దతు క్రమంగా పెరుగుతుంది. 83 ఏళ్ల లతా మంగేష్కర్, 43 ఏళ్ల సచిన్ టెండుల్కర్ లపై ఆయన చేసిన కామెడీని కామెడీగానే చూడాలని కూడా పలు స్వరాలు వినిపిస్తున్నాయి. తన్మయ్ భట్ కామెడీ ఏకంగా జాతీయ స్థాయిలో పతాక శీర్షక వార్తలను నమోదు చేసుకోవడంతో ఆయనకు మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఇది వాఖ్ స్వత్రంతానికి విఘాతం కలిగిస్తుందని బాలీవుడ్ నుంచి కూడా పలు గొంతులు పైకిలేస్తున్నాయి. ప్రతి మనిషి విషయంలోకి వెళ్లేందుకు ఇతరులకు ఒక పరిధి వుంటుందని, దానిని దాటి వెళ్లడం తప్పేనని, అయితే కామెడీ విషయంలో ఆ పరధులను అ పరధులను తొలగించాలన్న డిమాండ్ కూడా వినబడుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tanmay Bhat  comedian  Youtube video  MNS  Google  Facebook  

Other Articles