bjp critisizes on chief ministers full page advertisements

I am innocent harish rawat says in full page advertisement

Harish Rawat, Harish Rawat sting, Uttarakhand, Uttarakhand Chief Minister Harish Rawat, advertisement, Munna Singh Chauhan, full page ads, innocent

Accusing Uttarakhand Chief Minister Harish Rawat of "misusing" public money, BJP demanded that a case be registered against him for putting out advertisement aimed at "personal image building" in violation of a Supreme Court directive.

నేను నిరపరాధిని.. ఫుల్ పేజ్ ప్రకటనలు

Posted: 05/29/2016 11:19 AM IST
I am innocent harish rawat says in full page advertisement

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ తాను నిరపరాదినని, ప్రజల ప్రభుత్వానికి అండగా నిలవాలని పేర్కోంటూ ఇచ్చిన దినపత్రిక ప్రకటనలు వివాదాస్పందా మారాయి. సోంత పార్టీ ఎమ్మెల్యేలకు లంచాలను ఇచ్చేందుకు ఆయన సమ్మతిస్తున్నట్లు గతంలో స్టింగ్ అపరేషన్ వెలుగు చూసిన నేపథ్యంలో.. ఆ కేసు ఎదుర్కొంటున్న ఆయన ఇటీవల స్థానిక దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిర్దోషినని అందులో పేర్కొన్నారు. ప్రజలు తనకు అండగా నిలవాలని కూడా అభ్యర్థించారు.

స్టింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ ఎదుట హాజరు కావడానికి ముందురోజు ఉత్తరాఖండ్ సమాచార శాఖ ఈ ప్రకటన జారీచేసింది. తనను కుట్రపూరితంగా ఇరికించారని ప్రకటనలో రావత్ పేర్కొన్నారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రజా ధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లఘించి ప్రకటన ఇచ్చిన రావత్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు. అయితే సీఎం సందేశాన్నే ప్రకటన రూపంలో ఇచ్చామని సమాచార శాఖ డైరెక్టర్ వినోద్ శర్మ తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Rawat  advertisement  Munna Singh Chauhan  full page ads  innocent  

Other Articles