Warner's masterclass takes Sunrisers to IPL final

Warner s masterclass takes sunrisers to ipl final

ipl 2016, ipl, ipl play-offs, ipl final, david warner, david warner srh, david warner hyderabad, srh david warner, srh vs gl, gujarat hyderabad, sunrisers Hyderabad, Gujarat Lions, SRH vs GL, hyderabad, Qualifier 2,IPL 9,Cricket latest IPL 9 news

Skipper David Warner produced a majestic 93 as he single-handedly led Sunrisers Hyderabad into the IPL final after securing a fourwicket win over Gujarat Lions in the Qualifier 2.

ఒంటిచేతి విజయం.. ఇక తుది సమరం..

Posted: 05/28/2016 08:54 AM IST
Warner s masterclass takes sunrisers to ipl final

ఎనమిది జట్ల మధ్య గత రెండు నెలలుగా సాగిన హోరాహోరి పోరు చివరి దశకు చేరుకుంది. గత రెండు మాసాలుగా క్రికెట్ అభిమానులకు కనువిందును పంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పండగ అఖరి అంకానికి చేరింది. ఫైనల్ లో చేరుకునేందుకు గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిని రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో తమ హైదరాబాద్ జట్టును కెప్టెన్ డేవిడ్ వార్నర్ విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్ ను తన సత్తాకు పరీక్షగా తీసుకున్న ఆయన అంతే అత్యద్భుత ప్రదర్శనను ఇచ్చాడు. చెత్త బంతులు వచ్చే వరకు నిరీక్షించి.. వాటికి తగిన బౌండరీలను బాదుతూ హైదరాబాద్ ను ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు.

క్వాలిఫయర్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్థేశించిన 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ లక్ష్య ఛేదనలో తడబడింది. ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌ గా వెనుదిరిగా డు. వన్‌డౌన్‌లో వచ్చిన హెన్రిక్స్‌ (11) రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్టు కనిపించి నా స్మిత బౌలింగ్‌లో ద్వివేదికి క్యాచ్‌ ఇచ్చి పెవిలి యన్‌కు చేరాడు. ఆదుకుం టాడ నుకున్న యువరాజ్‌ (8) కౌశిక్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి స్మితకు చిక్కాడు. కొద్దిసేపటికే దీపక్‌ హుడా (4), బెన్‌ కటింగ్‌ (8) కూడా అవుటయ్యా రు. దీంతో 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ కష్టాల్లో పడింది.
 
మరోవైపు సహచరు లంతా వెనుదిరుగుతున్నా.. తనదైన శైలిలో రెచ్చిపో యిన వార్నర్‌ జట్టుని విజయం దిశగా నడిపించా డు. బౌండ్రీతోనే పరుగుల ఖాతా తెరిచిన డేవిడ్‌.. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నా డు. అయితే నమన్‌ ఓఝా (10)ను బ్రావో అవుట్‌ చేశాడు. ఈ దశలో వార్నర్‌కు జతకలిసిన బిపుల్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడి ఒత్తిడి తగ్గించాడు. చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు కావాల్సిన దశలో ప్రవీణ్‌, కులకర్ణి బౌలింగ్‌ల్లో బిపుల్‌ రెండు సిక్సర్లు రాబట్టాడు. దీంతో చివరి 12 బంతుల్లో 24 పరుగులు కావాల్సి వచ్చింది. బ్రావో వేసిన 19వ ఓవర్లో వార్నర్‌ 4, 2, 2 4, 1 కొట్టగా ఆఖరి బంతికి బిపుల్‌ శర్మ భారీ సిక్సర్‌ సాధించాడు. దీంతో ఆఖరి ఓవర్లో రైజర్స్‌ విజయానికి 5 పరుగులు అవసరమ య్యాయి. ప్రవీణ్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతిని బౌండ్రీకి తరలించిన వార్నర్‌.. ఆ తర్వాత సింగిల్‌ తీసి రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. మొత్తంగా 58 బంతుల్లో 93 పరుగులు సాధించిన వార్నర్ నాటౌట్ గా నిలిచాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  David Warner  Sunrisers Hyderabad  IPL final  Royal Challengers  Gujarat Lions  

Other Articles