"Please don't leave me!" Desperate man clings to girlfriend in embarrassing breakup

Desperate man holds on to girlfriend in public despite break up

China, Girlfriend, Holding legs, lover begs not to leave, lover girl friend begs, girlfriend, funny, pranks, prank, boyfriend, bfvsgf, fun, hilarious, relationship, boyfriend does girlfriend makeup, crazy reaction, dating, comfort

Captured footage shows the youth not only begging his girlfriend not to leave him but also crawling on the ground in despair.

ITEMVIDEOS: ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం..

Posted: 05/24/2016 10:36 PM IST
Desperate man holds on to girlfriend in public despite break up

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అంటూ విరహగీతం అలపిస్తున్నాడు ఓ ప్రేమికుడు. తనపై కోసంతో తన ప్రేయసి విడిపోతుండటంతో అతను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. అంతేకాదు చేయకూడని పనులు కూడా నడిరోడ్డుపై చేసి అబాసుపాలయ్యాడు. అయినా ఆ కఠినాత్మురాలి హృదయం కరగలేదు. తన ప్రియుడిపై పబ్లిగానే చేయకూడని పనులు చేసింది. ఇంతకీ ఏమైందంటారా..? ప్రేయసి ‘ఇక చాలు.. విడిపోదాం’ అని చెబితే కొంతమంది ఎగిరి గంతేస్తారు.. మరికొందరు దేవదాసులా మారిపోతారు.

చైనాలో ఓ కుర్రాడు మాత్రం ‘ప్లీజ్ నన్ను వదలద్దు’ అంటూ అచ్చంగా ఆమె కాళ్లు పట్టుకుని నేలమీద పడి ఆమెను ప్రాధేయపడ్డాడు. ‘ఛీ.. పో.. నువ్వు నాకు వద్దు’ అంటూ ఆ అమ్మాయి అతగాడిని పలుమార్లు చెంపమీద కొట్టింది. అయినా అతడు మాత్రం వదల్లేదు. అతడు గట్టిగా ఆమె కాళ్లు పట్టుకుని ఉండటంతో ఆమెకు తప్పించుకుని పోవడానికి కూడా వీలు కుదర్లేదు. రోడ్డు మధ్యలో నేలమీద పడి.. ఆమె కాలు పట్టుకుని ప్రేమభిక్ష పెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె మాత్రం అతడిని చీదరించుకుంటూ ‘సిగ్గు లేదా.. నన్ను వెళ్లనివ్వు, నీకు చికాకు అనిపించడం లేదా’ అని విసుక్కుంది.

చివరకు కాళ్లతోను, చేతులతోను కొట్టడం మొదలుపెట్టింది. కానీ అతడు మాత్రం ‘దయచేసి.. నన్ను వదలొద్దు’ అంటూ ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఆమె మాత్రం ఇక ఇద్దరం కలిసుండే ప్రసక్తి లేనే లేదని చెబుతోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు రాష్ర్టంలో గల హువియాన్ నగరంలో ఈ సంఘటన జరిగింది. చుట్టుపక్కల వెళ్లే వారంతా ఇది చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. అంతేలే అమ్మాయిలను అస్సలు నమ్మెద్దు ఎంత కఠినంగా వుంటారో చూడండీ అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికోందరు మాత్రం నాలుగు గోడల మధ్య సవ్యంగా లేకపోతే నలుగురిలో నవ్వుల పాలు కావాల్సివస్తుందంటూ కామెంట్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Girlfriend  Holding legs  

Other Articles