Breads, pavs, buns and pizza bases contain cancer-causing chemicals, says latest CSE report

84 of delhi s bread pizzas and burgers contain cancer causing chemicals

bread causes cancer report, cse report on breads, cancer chemicals in breads buns pizzas, centre for science and environment, carcinogenic chemicals in breads, potassium bromate, potassium iodate

According to the report, 84 per cent of bread and bakery samples collected from across Delhi contain residues of potassium bromate, potassium iodate or both.

జంక్ ఫుడ్ ప్రియులకు ఇది నిజంగా చేధువార్తే..

Posted: 05/24/2016 03:17 PM IST
84 of delhi s bread pizzas and burgers contain cancer causing chemicals

బ్రెడ్, బటర్, జామ్ అన్న పదాలు ఆంగ్లమే. పాశ్య్చాత మోజులో పడి సంపన్న వర్గాలు మొదలుకుని మధ్యతరగతి వారు ఇప్పుడు జంక్ ఫుడ్ కే అధిక ప్రాధాన్యతనిస్తూ.. వాటిని ఎంచక్కా అరగిస్తున్నారు. మరికోందరు మాత్రం మేము బ్రెడ్ కొని ఇంట్లోనే అన్ని తయారు చేసుకుంటాం. కన్పక్షనరీకి వెళ్లమని చెబుతారు. అంతేకాదు మామాలుగా బెకరీల్లో తయారయ్యై బ్రెడ్ కాకుండా బ్రాండెండ్ కంపనీల బ్రెడ్ నే వినియోగిస్తాం అంటున్నారు. అయితే మీకు ఈ నిజం తెలియాల్సిందే. బ్రెడ్ ప్రియులకు ఇది నిజంగా చేదు వార్తే. భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) పరీక్షల్లో తేలింది.

బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న  ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు సీఎస్‌ఈ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్‌ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్‌లు, బర్గర్‌లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్‌ఈ పరీక్షించింది.

వీటిలో 84 శాతం  పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు.  బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి.  నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్‌ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు తేలిందన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cancer Free  Cancer  Centre for Science and Environment  Bread  

Other Articles