ఒళ్లు మండిన ఒంటె ఓనర్ను చంపింది | camel attacks and kills owner

Camel attacks and kills owner

Camel, Camel kills owner, Rajasthan, Jaisalmir, ఒంటె, రాజస్థాన్

In Rajasthan's Barmer district, an agitated camel reportedly severed its owner's head, after being left in the heat all day with its legs tied.After the incident, which took place on Saturday, villagers say they had to struggle for around six hours to get control of the animal.

ఒళ్లు మండిన ఒంటె ఓనర్ను చంపింది

Posted: 05/24/2016 10:16 AM IST
Camel attacks and kills owner

మీరు చదువుతున్నది అక్షరాల నిజం. ఓ ఒళ్లు మండిన ఒంటె తన ఓనర్ నే చంపేసింది. తనను చూసుకుంటున్న ఓనర్ మీద కోపంతో మెడను కట్టిగా కొరికి నేలకు బలంగా కొట్టింది. ఎక్కడపడితే అక్కడ కొరికేసింది. ఒంటెను అదుపుచెయ్యడానికి దాదాపు 25 మంది ఆరు గంటల పాటు కష్టపడ్డారు. కానీ అంతలోనే తీవ్ర గాయాలపాలైన ఓనర్ కన్ను మూశాడు. ఇదంతా మన రాజస్థాన్ లోని జైసల్మీర్ ఏరియాలో జరిగింది. రాజస్థాన్ లో ఒంటె కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్కడి వారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే ఒంటె ఏకంగా ఓనర్ ప్రాణాలు ఎందుకు తీసిందో తెలుసా..?

అసలే జైసల్మీర్ ఏరియా.. అందునా ఒళ్లు కాలిపోయే ఎండ. అలాంటి ఎండలో ఉదయం నుండి సాయంత్రం వరకు కట్టి ఉంచిన ఓనర్ మీద కోపంతో ఈ పని చేసింది. నిజానికి ఓనర్ ఇంటికి చుట్టాలు వస్తే వారితో మాట్లాడటానికి అని, ఒంటెనున బయట కట్టేసి లోపలికి వెళ్లాడు. మాటల్లోపడి ఒంటె సంగతి మరిచిపోయాడు. సాయంత్రానికి దాని విషయం గుర్తుకు వచ్చి గాబరగాబరాగా అక్కడికి వెళ్లితే అప్పటికే ఒళ్లు మండిన ఒంటె ఓనర్ ప్రాణాలు తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Camel  Camel kills owner  Rajasthan  Jaisalmir  ఒంటె  రాజస్థాన్  

Other Articles