శోభనాన్ని ఆపిన పోలీసులు | Police stopsFirst night

Police stopsfirst night

First Night, Marriage, Police, శోభనం,. పెళ్లి, పోలీసులు

In A rare case, police stops first night.Police tool bride into cutody and enquire about his health condition.

శోభనాన్ని ఆపిన పోలీసులు

Posted: 05/24/2016 10:48 AM IST
Police stopsfirst night

మామూలుగా చాలా సినిమాల్లో పెళ్లి జరిగే టైంలోఈ పెళ్లి ఆపండ్రా అనే సౌండ్ వినిపిస్తుంటుంది. కానీ ఓ చోట మాత్రం పెళ్లి తర్వాత జరగుతున్న శోభనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. పెళ్లైన రెండు రోజులకు శోభనానికి ముహూర్తం కుదిర్చారు పెళ్లి పెద్దలు.అయితే పాల గ్లాస్ తో శోభనం గదిలోకి వెళ్లిన అమ్మాయి, అబ్బాయి ఆ అద్భుత గడియలను గడుపుతారు అనుకున్న టైంలో అక్కడికి హడావిడిగా పోలీసులు ఎంటర్ అయ్యారు. వెంటనే శోభనం ఆపండి అంటూ బిగ్గరా అరిచారు. దాంతో అందరూ షాక్ తిన్నారు. శోభనాన్ని ఆపడం ఏంటి అని ఆరా తీస్తున్నారు. ముందు శోభనం గదిలోని కొత్త పెళ్లి కొడుకుకు బయటకు లాక్కొచ్చారు.

ఇంతకీ పోలీసులు ఎందుకు అలా శోభనాన్ని ఆపారో తెలుసా..? ఆ వ్యక్తికి ఎయిడ్స్ ఉంది. ఆ విషయం అతడికి కూడా తెలుసు. పెళ్లికి ముందు ఓ సారి విదేశాలకు వెళదామనుకున్న అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎయిడ్స్ ఉందని తేలింది. అయితే ఈ విషయాన్ని కప్పిపెట్టి పెళ్లికి సిద్దమయ్యాడు ఆ వ్యక్తి. గుర్తు తెలియని వ్యక్తి సమాచారంతో వెంటనే అప్రమత్తమైన స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసులను వెంటపెట్టుకొని అక్కడికి చేరుకొని శోభనాన్ని అడ్డుకున్నారు. అలా ఆ అమ్మాయి జీవితాన్ని కాపాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : First Night  Marriage  Police  శోభనం  . పెళ్లి  పోలీసులు  

Other Articles