Smriti Irani Engages In Ugly Twitter Spat With Congress Leader Priyanka Chaturvedi

Twitter war between smriti irani congress priyanka chaturvedi

Smriti Irani, priyanka chaturvedi, congress, bjp, politicians fight, nirbhaya gang rape threats, assam elections, union minister, general elections, PM narendra modi, PM modi, Sonia Gandhi,

A war of words broke out today on twitter between HRD minister Smriti Irani and Congress leader Priyanka Chaturvedi, with the BJP leader taking a dig at Rahul Gandhi, saying that losing Assam elections was "his forte".

కేంద్రమంత్రికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది...

Posted: 05/23/2016 04:24 PM IST
Twitter war between smriti irani congress priyanka chaturvedi

కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ తవరలో రెండేళ్లను పూర్తి చేసుకోబోతోంది. అయితే ఇప్పుడామె సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైనా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సోషల్ మీడియా ట్విట్టర్‌ వేదికగా మారింది. అమేధిలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన స్మృతి ఇరాని.. కేంద్ర మంత్రి గా కన్నా అమేధికి మాత్రమే మంత్రిగా పనిచేస్తున్నారని.. అడపాదడపా అమేధిలో పర్యటించే అమె దేశానికి కేంద్రమంత్రన్న విషయాన్ని మర్చిపోయారని ఇప్పటికే విమర్శలు వెల్లువెతుత్తున్న సమయంలో అమె చిత్తుగా ఓడినా కేంద్ర మంత్రి బాధ్యతలను నిర్వహించడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో దుమ్ముత్తిపోసింది.

యధావిధిగా అమె ఇవాళ వస్తూవస్తూనే రాహుల్‌గాంధీపై  పదునైన వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. దీనికి దీటుగా అటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది బదులిస్తూనే స్మృతిని ఇరుకున పెట్టారు. వీరిద్దరి వాడీవేడి విమర్శలు, వాగ్వాదాలతో ట్విట్టర్‌ వేడెక్కింది. అదెలా అంటే.. తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపులు వచ్చినట్టు తాజాగా రాసిన ఓ వ్యాసంలో ప్రియాంక చతుర్వేది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె రాసిన వ్యాసం ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయింది.

ఈ నేపథ్యంలో ప్రియాంకపై దాడి చేస్తే అది మహిళల గౌరవంపై దాడి, అదే స్మృతి ఇరానీపై దాడి చేస్తే ఆమోదయోగ్యమా? అంటూ షెఫాలి వైద్య ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీంతో ప్రియాంక జోక్యం చేసుకొని తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని, కానీ స్మృతికి జెడ్‌ కేటగిరీ భద్రత ఉందని అన్నారు. దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. తనకు జెడ్‌ కేటగిరీ భద్రత లేదని వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో తీవ్ర వాగ్వాదమే నడిపించింది. మీకు జెడ్‌ కేటగిరీ భద్రత లేకపోయినా అసలు సెక్యూరిటీ లేకుండా ఉండదు కదా అని ప్రియాంక పేర్కొన్నారు

దీనిపై స్పందించిన స్మృతి.. తన భద్రత గురించి ఎందుకు ఆరా తీస్తున్నావు? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అని స్మృతి వ్యంగ్యంగా ప్రశ్నించారు. దానికి ప్రియాంక బదులిస్తూ.. నాకు అంత తీరిక లేదు. మీరేం భయపడకండి. ఎప్పటిలాగే క్యాంపస్‌లలో రచ్చ చేయడంపై దృష్టి పెట్టండని చురకలంటించారు. స్మృతి కౌంటర్‌ ఇస్తూ అది మీ రాహుల్‌గాంధీ విశిష్టత. అసోంలో ఓడిపోవడం కూడా ఆయన ఘనతేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రియాంక బదులిస్తూ మీరు ఓడిపోయినప్పటికీ క్యాబినెట్‌ మంత్రి కాలేదా అని కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఎంపీగా ఓడినా కేంద్రమంత్రిగా అమె బాధ్యతల నిర్వహించడంపై మళ్లీ పెద్ద దుమారమే లేపింది.

అయితే కొందరు ట్విట్టరైట్లు మాత్రం స్మృతి ఇరానీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ విపక్ష నేతకు నిర్భయ తరహాలో సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్న తరుణంలో.. ఒక మహిళగా. అందులోనూ కేంద్రమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్న స్మృతి ఇరానీ తనకు జెడ్ క్యాటగిరి లేదని, అసలు భద్రతపై ఎందుకు ఆరా తీస్తున్నావని కాంగ్రెస్ నేతను ప్రశ్నించడం అమో అహంభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. అమెను ఎవరు నుంచి బెదిరింపులు వచ్చాయి.? వాటినెలా పరిష్కరించాలన్న అంశాన్ని పక్కన బెట్టి.. కేవలం అన్ని అంశాలను రాజకీయం చేయడమేనా కేంద్ర మంత్రి బాధ్యతని పలువురు ట్విటరైట్లు మండిపడుతున్నారు. 2014 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో జరిగిన నిర్భయ ఘటనను గురించి మాట్లాడిన బీజేపి నేతల స్వరంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని దుయ్యబడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Smriti Irani  Twitter  priyanka chaturvedi  

Other Articles