కొత్త జిల్లాలపై కేసీఆర్ దృష్టి | CM KCR focused on new dists in Telangana

Cm kcr focused on new dists in telangana

Telangana, Dists, New Districts, KCR, కేసీఆర్, కొత్త జిల్లాలు, తెలంగాణ

Telangana state govt planning to create new districts in the state.

కొత్త జిల్లాలపై కేసీఆర్ దృష్టి

Posted: 05/23/2016 09:13 AM IST
Cm kcr focused on new dists in telangana

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలకు 37,500 ఉద్యోగులు అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కలెక్టర్లు, శాఖాధిపతులను వీరికి అదనం. రాష్ట్రంలో ఐఎఎస్‌ల కొరత ఉన్నందున డిప్యూటీ కలెక్టర్లకు కలెక్టర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. డీఆర్‌ఓలుగా పని చేస్తున్న వారికి సీనియార్టీ ప్రాతిపదికన ప్రమోటీ ఐఎఎస్‌లుగా పదోన్నతి కల్పించనున్నట్టు తెలుస్తోంది. 8 మండలాలకు ఒక ఆర్డీఓను నియమించాల్సి ఉన్నందున కొందరు సీనియర్‌ తహసీల్దార్లకు ఆర్డీఓలుగా ప్రమోషన్‌ కల్పించనున్నారు. 15 జిల్లాలకు ఒకేసారి ఇంతమంది సిబ్బందిని సమకూర్చడం సాధ్యం కాకుంటే ఇప్పుడున్న పది జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బందిలో కొంతమందిని కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకా శాన్ని కూడా అధికారుల పరిశీలిస్తున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రె సిడెన్షియల్‌ ఆర్డర్‌ లేనందున పాత జిల్లాల్లో పని చేస్తున్న సిబ్బందిని కొత్త జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉందా? లేదా? అన్న మీ మాంశలో అధికారులు ఉన్నారు.

పాలన సౌలభ్యం కోసం ఒక్కో జిల్లాలో 2500 మంది సిబ్బంది, శాఖాధిపతులతో పాటు ఇతర అధికారులను నియమిం చనున్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 41 శాఖలున్నాయి. ఆయా శాఖలకు ఒక శాఖాధిపతి ఉన్నారు. అదే తరహాలో జిల్లా కేంద్రంలో కూడా 41 శాఖలను ఏర్పా టు చేసి అక్కడే శాఖాధిపతులను నియమిస్తే పను లు సులువుగా సాగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అంతమంది శాఖాధిపతును నియామకాలు చేపట్టేందుకు ఆయా శాఖల్లో పని చేస్తున్న కింది స్థాయి అధికారులకు ప్రమోషన్‌ కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగులకు పదోన్నతి లభించను న్నట్టు తెలిసింది. అదేతరహాల్లో డిప్యూటీ కలెక్టర్లు, డీఆర్‌ఓలు, ఎమ్మార్వోలు కూడా పదోన్నతి పొందనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles