సాక్షిని సొంతం చేసుకోనున్న చంద్రబాబు | Will chandrababu naidu takeover Sakshi news paper

Will chandrababu naidu takeover sakshi news paper

AP, Sakshi, Chandrababu, Jagan, YS Jagan, Sakshi media, సాక్షి, చంద్రబాబు, ఏపి, జగన్

AP Cm chandrababu naidu several times said that sakshi will take over by govt.

సాక్షిని సొంతం చేసుకోనున్న చంద్రబాబు!

Posted: 05/20/2016 08:02 AM IST
Will chandrababu naidu takeover sakshi news paper

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెప్పే ఓ విషయం ఇప్పుడు నిజమవుతుందా అనే చర్చ జరుగుతోంది. అవినీతి ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు, అవినీతి సొమ్ముతో ప్రారంభమైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వపరమవుతుందని చంద్రబాబు చెప్పారు. రాజ‌ధాని భూముల కుంభ‌కోణంపై భారీ క‌థ‌నాలు రాసిన సాక్షిని అప్ప‌ట్లోనే స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ ముఖ్య‌మంత్రి..తాజాగా అదే బాణం మ‌ళ్లీ ఎక్కుపెట్టారు. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో ఒక్కొక్క‌రిని నిర్దోషులుగా కోర్టు ఒక వైపు విడుద‌ల చేస్తుంటే.. మ‌రోవైపు అక్ర‌మాస్తుల‌తో సంపాదించిన సాక్షి స‌ర్కారుదేనంటూ చంద్ర‌బాబు అంటున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం తూర్పుగోదావరి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో మ‌రోసారి జగన్ కుటుంబ ఆధ్వర్యంలో న‌డుస్తున్న సాక్షి ప‌త్రిక గురించి మాట్లాడారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటైన సాక్షి పత్రికను త్వ‌ర‌లో స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రత్యేక హోదా విషయంలో కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ర్ప‌చారం చేస్తున్నార‌ని, అవినీతి సొమ్ముతో ఏర్పాటైన జగన్ పత్రిక సాక్షి ఈ విష‌యంలో ముందు ఉంద‌ని బాబు ఆరోపించారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం సొమ్ము తినేసి పెట్టిన ప‌త్రిక ఆస్తుల‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని, అక్ర‌మాస్తులు ప్ర‌భుత్వానివేన‌ని, సాక్షి కూడా అక్ర‌మాస్తే కాబ‌ట్టి స‌ర్కారుద‌ని, అటువంటి ప‌త్రిక‌లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక క‌థ‌నాలు ఎలా ప్ర‌చురిస్తార‌ని బాబు ప్ర‌శ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles