Rajagopal scripts history, BJP makes a debut in Kerala

Bjp veteran rajagopal set to make history

O Rajagopal, Kerala Assembly elections, Kerala polls 2016, Kerala Rajagopal, BJP Rajagopal, Nemom seat, Rajagopal scripts history in Kerala, bjp o rajagopal

The BJP will thank Rajagopal for opening its account in the state assembly where bipolar politics have so far kept the party out of the reckoning.

ఎన్నికలలో బీజేపి అశలను సజీవం చేసిన ఒకేఒక్కడు

Posted: 05/19/2016 04:28 PM IST
Bjp veteran rajagopal set to make history

తనది సాధారణ పోరాటం కాదు. జనతా పార్టీ అభ్యర్థి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అయన ఎన్నో ఎన్నెన్నో పరాజయాలను చవిచూశారు. అయితే ప్రస్తుతం బీజేపికి అత్యంత అవసరంగా భావిస్తున్న తరుణంలో ఆ పెద్దాయన విజయం కేరళ బీజేపిలో నూతన జవసత్వాలను తీసుకువచ్చింది. అసోంలో రాజ్యాధికారం అందించిన దానికన్నా.. కేరళలో బీజేపీ సీనియర్ నాయకుడు ఒ. రాజగోపాల్ అందించిన విజయం బీజేపి పాలిట అక్సిజన్ లా పనిచేస్తుంది. అయన వియజమే కేరళలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది.

ఆయన గెలుపుతో రెండు పార్టీల మధ్యే దోబుచులాడుతున్న అధికార మార్పిడి.. మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశం కల్పించింది. కొత్త ఆశలను రేకెత్తిస్తున్నది. ఆయన కూడా తన విజయంతో కేరళలో 'కమలం' వికాసం మొదలైందని అన్నారు. గురువారం వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చరిత్ర సృష్టించారు. కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. నీమమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వి. శివన్ కుట్టిపై 8 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన గెలుపుతో కేరళలో బీజేపీ వికాసం మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఖాతా తెరవబోదని సీపీఎం, కాంగ్రెస్ తో సహా అంతా అన్నారని గుర్తు చేశారు. కేరళ అసెంబ్లీలో బీజేపీ చోటు లేదని, వీక్షకుల గ్యాలరీలో కూచునేందుకు బీజేపీ నేతలు విజిటర్ పాస్ తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఎద్దేవా చేశారని చెప్పారు. 'తాము అసెంబ్లీలో అడుగు పెడుతున్నామని, ఈ విజయం కార్యకర్తలదే'నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. రాజశేఖరన్ ట్వీట్ చేశారు. రాజగోపాల్ విజయం సాధించే వరకు కేరళలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా లేదు.

అసలు ఇంతకీ ఒ రాజగోపాల్ ఎవరు..? ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఎప్పుడు..? 87 ఏళ్ల వయస్సులో ఆయన సాధించిన విజయాన్ని బీజేపి అధినాయకత్వం ఎందుకు కీర్తిస్తుంది. ఆయన చేసిన పనులేంటి...? ఈ ప్రశ్నలన్నీ మీ మదిని తొలుస్తున్నాయని తెలుసు. ఈ పశ్ర్నలతో పాటు అనేక ప్రశ్నలు మీ మదిలో ఉత్పన్నమవుతున్నాయిని తెలుసు. అయితే వీటన్నింటిపై ఓ సారి పరిశీలిన చేద్దాం. ముందుగా ఈ 87 ఏళ్ల పెద్దాయనను అక్కడి ప్రజలు ముద్దుగా రాజెట్టన్ అని పిలుచుకుంటారు. అంటే రాజన్న అని అర్థం.

అంతలా ఆయనను పిలుచుకోవడానికి కారణం మాత్రం ఆయన కలుపుగోలుతనం, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి, ఆయన  మంచి వ్యక్తిత్వం వున్న వ్యక్తి, తన వారికి కష్టమెచ్చిందని తెలిస్తే చాలు ముందుండే వ్యక్తి. అదే ఆయనను తిరువనంతపురం శివార్లలో వున్న నెమామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపోందేలా చేసింది. 140 మంది శాసనసభ్యలున్న కేరళ అసెంబ్లీలోకి ఆయనను అడుగుపెట్టేలా చేసింది. ఈ విజయంతో కేవలం ఆయన ఒక్కరే కాదు.. జాతీయ స్థాయి బీజేపి నాయకులకు కూడా తీసి కబురును అందంిచింది.
 
* గతంలో ఆరు పర్యాయాలు ఓటమిని చవిచూసిన రాజగోపాల్
* 1980 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
* చివరగా గత ఏడాది జరిగిన ఉప ఎన్నికలలో అరువిక్కర స్థానం నుంచి పరాజయం పాలయ్యారు
* కాసర్ గోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ నుంచి ఆయన 1980లో పోటీచేసి తొలిసారి ఓడిపోయారు
* 1989 మంజేరి లోక్ సభకు, 1991, 1999, 2004లలో తిరువనంతపురం లోక్ సభకు పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
* 2011లో నెమామ్ నుంచి, 2012 నెయ్యాటికర నుంచి అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఓటమిపాలయ్యారు.
* 2014 పార్లమెంటు ఎన్నికలలో కూడా గెలుపుముంగిటకు వచ్చి శశిథరూర్ చేతిలో ఓటమిని చవిచూశాడు
* అయితే ఇన్ని పర్యాయాల ఓటమి తరువాత ఆయన ఇప్పుడు గెలుపోందారు.. రాష్ట్ర బిజేపిలో కొత్త ఆశలను రేకెత్తించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : O. Rajagopal  Kerala assembly election 2016  Nemom seat  

Other Articles