Ravi Teja fined by Traffic Police

Fine imposed by police on ravi teja

actor ravi teja, fine for ravi teja, ravi teja, ravi teja car, raviteja, traffic police, ravi teja traffic police, raviteja traffic rules, celebrities, ravi teja movies, ravi teja music, ravi teja headlines

Mass Maharaja Ravi Teja has been charged a fine of 800 rupees today. The traffic police officers at Jubilee Hills found that Ravi Teja was travelling in a car, which has black films for the window glasses.

మాస్ మహారాజా రవితేజకు పోలీసుల ఫైన్

Posted: 05/19/2016 01:49 PM IST
Fine imposed by police on ravi teja

హైదరాబాద్ రాజధాని నగరంలో నేరాల అదుపుకు పోలీసులు చేపడుతన్న చర్యలు ఇటు సామాన్యలతోపాటు అటు సెలబ్రీటీలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్ లో హైటెక్ సిటీతో పెరిగిపోతున్న పాశ్చత్య సంస్కృతికి చెక్ పెడుతూ నగరంలో ఎక్కడా రేవ్ పార్టీలకు తావు లేకుండా చేశారు. రిసార్టు నుంచి ఎక్కడ జూద క్లబ్ లు కూడా లేకుండా చేశారు. నగరంలో తాగి వాహనం నడపాలంటే భయపడే విధంగా ఎక్కడబడితే అక్కడ చెక్ పాయింట్లు పెట్టి తాగినోడి తాట తీశారు. చివరకు కార్డన్ సర్చ్ ల పేరిట నేరాలను నేర సంస్కృతిని అవలంభించే నేరస్థుల పాలిట కూడా పోలీసులు సింహస్వప్నంగా మారారు.

అదే క్రమంలో నిబంధనలు పాటించని టాలీవుడ్ సెలబ్రెటీలందరకీ వరసపెట్టి జరిమానాలు విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మొన్న నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ కారును నడిరోడ్డపై అపి జరిమానా విధించిన పోలీసులు.. తాజాగా మాస్ మహారాజా రవితేజకు కూడా జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేస్తుండగా సినీ నటుడు రవితేజ కారు అటుగా వచ్చింది. ఆయన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో దానిని నిలువరించారు.

కారుకు వున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన పోలీసులు, ఆ ఫిల్మ్ పెట్టినందుకు రూ.800 జరిమానా విధించారు. జరిమానా రశీదును అందుకున్న రవితేజ వాటిని చెల్లించి అక్కడ నుంచి పయనమయ్యాడు. క్రేజీ హీరోగా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్‌తో మంచి హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actor ravi teja  fine  Trafffic police  hyderabad  Telangana  

Other Articles