దేవినేని ఉమ Vs హరీష్ రావు | Harish Rao threatens Andhra Pradesh government of non-cooperation

Harish rao threatens andhra pradesh government of non cooperation

harish Rao, TS, AP, Irrigation Projects, Devineni Uma, దేవినేని ఉమ, హరీష్ రావు, ఏపి, తెలంగాణ

Demanding withdrawal of a letter written by the Kurnool district collector to his counterpart in Raichur, Karnataka, over taking up improvements works on the Rajolibanda Diversion Scheme, TS irrigation minister T. Harish Rao on Tuesday issued a veiled threat to the AP government of non-cooperation if it was not done.

దేవినేని ఉమ Vs హరీష్ రావు

Posted: 05/18/2016 07:11 AM IST
Harish rao threatens andhra pradesh government of non cooperation

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వివాదం ముదురుతోంది. ఆర్డీఎస్ పనులను నిలిపివేయాలంటూ కర్నాటకలోని రాయచూర్ జిల్లా కలెక్టర్కు.. కర్నూలు కలెక్టర్ లేఖ రాయడంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమను ఫోన్లో కోరారు. లేదంటే సాగునీటి విషయంలో ఏపీకి సహకరించబోమని స్పష్టం చేశారు హరీష్రావు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీక్షలతో, కోర్టు కేసులతో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే వూరుకునేది లేదని, జగన్, చంద్రబాబులు ఇలాంటి కుట్రలను మానుకోకపోతే పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు.

భవిష్యత్తులో తాము తీసుకోబోయే నిర్ణయాలతో నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని, అందుకు చంద్రబాబు, జగన్లే కారణమవుతారని పేర్కొన్నారు. హరీశ్రావు ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన చుక్కనీరు మాకొద్దని, కృష్ణానది నుంచి 376 టీఎంసీల నీటి కేటాయింపు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా 376 టీఎంసీల వినియోగానికి లోబడే కడతామన్నారు. బ్రిజేష్కుమార్ ఇచ్చే తీర్పుకు లోబడే ఉంటామన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలపై ప్రేమ ఉంటే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవద్దన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles