Jayalalitha to lose in TN, BJP to gain in Assam, Didi to retain chair in WB: Exit Polls

Congress to lose assam kerala to gain tn pudducherry says exit polls

five state elections, exit polls, assam election, tamil nadu elections, west bengal elections, kerala elections, Narendra Modi, Oommen Chandy, Kerala, Left, tarun gogai, jaya lalithaa, karunanidhi, stalin, mamatha banarjee,

With the staggered elections in the states of Assam, West Bengal, Tamil Nadu, Kerala, and Puducherry now complete, psephologists have arrived on the scene with their poll predictions.

మార్పు కోరుకుంటున్న ఓటరు.. మమతకు ఢోకాలేదు

Posted: 05/16/2016 09:31 PM IST
Congress to lose assam kerala to gain tn pudducherry says exit polls

అసోంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రానుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు అసోం ఓటర్లు చరమగీతం పాడబోతున్నారని వెల్లడించాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి 79 నుంచి 93 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఇండియాటుడే-యాక్సిస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 26 నుంచి 33, ఏఐయూడీఎఫ్ కు 6-10 స్థానాలు దక్కే అవకాశముందని వెల్లడించింది. బీజేపీ కూటమికి 81, కాంగ్రెస్ 33, ఏఐయూడీఎఫ్ 10 సీట్లు గెల్చుకునే అవకాశముందని ఏబీపీ-ఆనంద సర్వే అంచనా వేసింది. బీజేపీ కూటమి 57, కాంగ్రెస్ 41, ఏఐయూడీఎఫ్ 18, ఇతరులు 10 చోట్ల విజయం సాధిస్తారని సీఓటర్ సర్వే తెలిపింది. బీజేపీ కూటమి 90, కాంగ్రెస్ 27, ఏఐయూడీఎఫ్ 9 స్థానాల్లో గెలిచే అవకాశముందని అసోం టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. ఈనెల 19న కౌంటింగ్ జరగనుంది.

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికార నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మమతా బెనర్జీ రెండో పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారని పేర్కొన్నాయి. బెంగాల్ లోని 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ 178, వామపక్ష కూటమి 110 సీట్లు గెల్చుకునే అవకాశాలు ఉన్నాయని ఏబీపీ ఆనంద్ సర్వే వెల్లడించింది. బీజేపీ ఖాతా తెరవనుందని తెలిపింది. ఇతరులు 5 స్థానాలు దక్కించుకుంటారని అంచనా వేసింది. తృణమూల్ 167, సీపీఎం 75, కాంగ్రెస్ 45, బీజేపీ 4, ఇతరులు 3 చోట్ల గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సీఓటర్ సర్వే తెలిపింది. తృణమూల్ 233-253, వామపక్ష కూటమి 38-51, బీజేపీ 1-5 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని బెంగాల్ ఇండియా టుడే సర్వే వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ నెల 19న ఓట్లు లెక్కించనున్నారు.

తమిళనాడులో 'అమ్మ'కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత నిలుపుకోవడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. కురువృద్ధుడు కరుణానిధిపై తమిళ ఓటర్లు కరుణ చూపారని అంటున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 114-118, అన్నాడీఎంకే 95-99, పీడబ్ల్యూఎఫ్‌ 14, బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తమిళనాడు న్యూస్ నేషన్ సర్వే వెల్లడించింది.  డీఎంకే 124-140, అన్నాడీఎంకే 89-101, బీజేపీ 0-3 సీట్లలో విజయం సాధించే అవకాశముందని తమిళనాడు ఇండియాటుడే అంచనా వేసింది. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తమిళనాడు యాక్సిస్ ఇండియా సర్వే తెలిపింది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్‌)కు 88 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశముందని, ఆ పార్టీ క్లియర్‌ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 38 నుంచి 48 సీట్లు రావొచ్చునని పేర్కొంది. బీజేపీతోపాటు ఇతరులకు కలిపి సున్నా నుంచి మూడు సీట్ల వరకు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది.

అటు పుదుచ్చేరిలోనూ డీఎంకే కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ ఫోల్స్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చెరి అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి 15 నుంచి 21కి మద్య స్థానాలను సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా టుడే యాక్సిక్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన వివరాల ప్రకారం డీఎంకే, కాంగ్రెస్ కూటమి 15 నుంచి 21 స్థానాలతో ఆ కూటమి సునాయాసంగా అధికార ఫీఠాన్ని అధిరోహిస్తుందన్ని సమాచారం, కాగా అల్ ఇండియా రంగస్వామి కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 12 స్థానాలను, అన్నా డీఎంకే పార్టీ 1 నుంచి 4 స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : five state elections  exit polls  assam  tamil nadu  west bengal  kerala  

Other Articles