కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చిన జగన్ | jagan target KCR

Jagan target kcr

KCR. jagan, Ap, Projects, Ap projects, Chandrababu Naidu, ఏపి, చంద్రబాబు, కేసీఆర్, జగన్

YS jaganmohan Reddy targets Telangana Cm KCR. He compared KCR to Hitler.

కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చిన జగన్

Posted: 05/17/2016 07:30 AM IST
Jagan target kcr

ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుంది ఏపి నాయకుల పరిస్థితి. ఏపిలో తమ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన నాయకులు తెంలగాణ సిఎం కేసీఆర్ ను మధ్యలోకి లాగుతున్నారు. చంద్రబాబు కేసీఆర్, జగన్ కలిసి కుట్రచేస్తున్నారని అంటారు. ఇక జగన్ కేసీఆర్ ను హిట్లర్ తో పోల్చారు. సిఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో అంతర్గత ఒప్పందం చేసుకున్నారని.. ఏపి ప్రయోజనాలను గాలికి వదిలేశారు అని జగన్ ఫైరయ్యారు. నిన్నటి దాకా కేసీఆర్ గురించి పల్లెత్తి మాట మాట్లాడని జగన్ కూడా ఇప్పుడు టార్గెట్ చెయ్యడం విశేషం.

తెలంగాణ ప్ర‌భుత్వం పాల‌మూరు-డిండి ప్రాజెక్టుల‌ను అక్ర‌మంగా నిర్మిస్తోందని.. దానికి వ్యతిరేకంగా జ‌గ‌న్ దీక్ష చేశారు. అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్ర‌బాబు మౌనంగా ఉంటున్నార‌ని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు జగన్. అయితే అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా జ‌ల‌దీక్ష‌లో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో పైర్ అయ్యారు. కేసీఆర్ ను హిట్ల‌ర్ తో పొల్చ‌డ‌మే కాకుండా ఎవడ‌బ్బ జాగీరని ప్రాజెక్టులు క‌డుతున్నావంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ సీఎం వైఖ‌రితో నీటి యుద్దాలు వ‌చ్చే అవ‌కాశ‌ముందన్నారు. ప్రాజెక్టులు ఆప‌క‌పోతే ఏపీ ప్ర‌జ‌ల ఉసురు కేసీఆర్ కు త‌ప్ప‌ద‌ని శాప‌నార్థాలు పెట్టారు. త‌న ప్ర‌సంగంలో చంద్ర‌బాబును పెద్ద‌గా ప‌ట్టించుకోని జ‌గ‌న్... టీఆర్ఎస్ అధినేత‌ను టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles