Vijay Mallya will return to India but only if his safety and freedom are ensured

Vijay mallya tells ub board he has every intention of repaying loans

vijay mallya loans,Vijay Mallya india,vijay mallya deport,Vijay Mallya,UBL Board of directors

Vijay Mallya, who is under immense pressure, has stated that he wishes to honour his commitments, and has offered a new settlement to the main lender SBI.

మళ్లీ మభ్య పెడుతున్న మాల్యా.. భారత్ కు వస్తానని వ్యాఖ్య

Posted: 05/16/2016 06:54 PM IST
Vijay mallya tells ub board he has every intention of repaying loans

బ్యాంకుల నుంచి రుణాలు పోంది విదేశాలలో అస్తులను కూడబెట్టారన్న ఈడీ అరోపణల నేపథ్యంలో ఇక తాను ఇప్పట్లో భారత్ కు రానని తేల్చిచెప్పిన వ్యాపార వేత్త, ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా.. ఇదిగో వస్తున్నా..అదిగో వస్తున్నా అంటూ మళ్లీ ఊరిస్తున్నాడు. అయితే కొన్ని ప్రత్యేక షరతులతో.. తనకు పూర్తి భద్రత కల్పిస్తే వస్తానంటూ కొత్త రాగం అలపిస్తున్నాడు. ఇన్నాల్లు బ్యాంకులకు రుణం తీరుస్తాను.. అయితే కొద్దిగానే అంటూ అప్పు పోందిన రుణాలపై తిరిగి చెల్లింపుల విషయంలో తానే బ్యాంకులను శాసించే స్థాయిని కనబర్చిన మాల్యా.. ఇంటర్ పోల్ ను ఈడీ ఆశ్రయించిన నేపథ్యంలో భారత్ కు తిరిగివచ్చేస్తానని ప్రకటించాడు.

యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పాల్గొన్న మాల్యా రక్షణకు సరైన హామీ లభిస్తే త్వరలోనే తాను ఇండియాకు తిరిగి రానున్నట్టు తెలిపారు. అయితే భారత ప్రభుత్వం నుంచి తనకు భద్రత,  స్వేచ్ఛ, రక్షణకు సంబంధించి  హామీ లభిస్తే ఇండియా తిరిగి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని  ప్రకటించినట్టు సమాచారం.   రుణాల చెల్లింపులో బ్యాంకులతో చర్చలు జరపనున్నట్టు మాల్య తమకు హామీ ఇచ్చారని  ఇండిపెండెంట్ ప్రతినిధి కిరణ్ మజుందార్ షా తెలిపారు. మాల్యా ప్రతిపాదనలకు  బోర్డ్  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు మరో ఇండిపెండెంట్  ప్రతినిధి  సీవై పాల్  వెల్లడించారు. అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బంది జీతాల చెల్లింపునకు  తాను చేసిన ప్రయత్నాలు తన ఆస్తులు సీజ్ చేయాలనే  కర్నాటక హైకోర్టు నిర్ణయం మూలంగా  విఫలమయ్యాయన్నారని చెప్పారు.  

ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం తనపై వచ్చిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారన్నారు. మనీ లాండరింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మాల్యా వాదించారనీ,   ఆధారాలు లేని ఆరోపణలని  కొట్టి పారేసారని తెలిపారు. కాగా  బ్యాంకుల కన్సార్టియానాకి 9 వేల కోట్లకు పైగా  బకాయి పడి  విదేశాల్లో  తలదాచుకున్న  విజయ్ మాల్యా, రుణాల చెల్లింపుకు గడువుల  గడువుల మీద విధిస్తూ బేరసారాలకు దిగాడు.  ఆయన ప్రతిపాదనలకు కన్సార్టియం ససేమిరా అనడంతో వివాదం మరింత సాగుతోంది.  అటు మనీ లాండరింగ్ కేసులో  మాల్యాను ప్రశ్నించేందుకు ఈడీ  చూస్తోంది.  ఈ నేపథ్యంలో ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు, గోవాలోని ఆయన విల్లా స్వాధీనం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay mallya  loans  UBL Board of directors  sbi  

Other Articles