గూగుల్ కు 23వేల కోట్ల ఫైన్ | 23 thousand crore fine for Google search engine

23 thousand crore fine for google search engine

Google, Google search engine, Google fined, court, గూగుల్, గూగుల్ సెర్చ్ ఇంజిన్

European antitrust authorities will impose a record fine on Google in coming weeks for abusing its dominance of the online search market in the region, the U.K.’s Telegraph newspaper reported.

గూగుల్ కు 23వేల కోట్ల ఫైన్!

Posted: 05/16/2016 03:11 PM IST
23 thousand crore fine for google search engine

నెట్ అంటే గూగుల్.. గూగుల్ అంటేనే ఇంటర్నెట్ అనేంతగా మారింది గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఎవరు, ఎప్పుడు, ఏ విషయం మీదైనా కూడా ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. లెక్కలేనంత సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చు. మరి అలాంటి గూగుల్ తప్పులు చేస్తోంది అంటేనే ఎవరూ నమ్మరు.. కానీ గూగుల్ సెర్చింజన్ కు భారీగా జరిమానా పడే అవకాశాలున్నాయి. ఎందుకు అంటారా... గూగుల్ తమకు అనుకూలమైన కంపెనీలకు ఫేవర్ గా ఉందని, మిగిలిన వాటిని దెబ్బతియ్యడానికి ప్లాన్ వేస్తోందని తెలిసింది.

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పై భారీ జరిమానా పడనుందా? నెటిజన్లు ఏదైనా సెర్చ్ చేస్తే, తమకు అనుకూలమైన కంపెనీల గురించిన వివరాలు ముందు కనిపించేలా గూగుల్ సాఫ్ట్ వేర్ ను మార్చిందని, ప్రత్యర్థి కంపెనీలను దెబ్బతీయడమే గూగుల్ ఉద్దేశమని దాఖలైన కేసులో విచారణ ముగియగా, గూగుల్ కు వ్యతిరేకంగా తీర్పు రానుందని ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్' తెలిపింది. మూడు బిలియన్ యూరోలు (సుమారు రూ. 23 వేల కోట్లు) జరిమానాగా చెల్లించాల్సి రావచ్చని పేర్కొంది. జూన్ మొదటి వారంలో జరిమానాపై తుది నిర్ణయం వస్తుందని అధికారులు చెబుతుండగా, ఆపై సెర్చ్ రిజల్ట్స్ ఇచ్చే అధికారాలపైనా కోత పడుతుందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక విచారణలో భాగంగా సెర్చింజన్ పరిశీలించిన సమయంలో మొదటి స్థానంలో నిలిచిన కంపెనీలపై 10 శాతం జరిమానాగా సుమారు రూ. 2,300 కోట్లు విధించవచ్చని తెలుస్తోంది.

-Abhinavachary

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles