Posthumous marriage:Ghost wedding with woman corpse held in China

Ghost wedding with woman corpse held in china

Shanxi Province, pacify the soul of bachelor son, good social match, ghost daughter-in-law, ghost wedding, deceased daughter, ancient social custom, posthumous marriage, professor Chen Wenhua, Zhejiang Normal University

A family in China’s Shanxi Province has conducted a “ghost wedding” with the corpse of a woman to pacify the soul of their son who died as a bachelor, in the latest case highlighting the grisly age old custom in rural China.

దెయ్యాల పెళ్లికి పద్దెనిమిది లక్షల కన్యాశుల్కం..

Posted: 05/16/2016 12:16 PM IST
Ghost wedding with woman corpse held in china

మూడాచారాలు కాలం చెల్లిందని ఎంత పైకి చెప్పుకుంటున్నా.. వాటి ప్రబావాన్ని అవి చాటుకుంటున్నాయి. వర్షాలు పడాలని, కప్పలకు పెళ్లిళ్లు చేసే వారు లేకపోలేదు. అలా అని ఎద్దులకు, శునకాలకు కూడా పెళ్లిళ్లు చేసే వారు వున్నారు. వీటన్నింటి వెనుక బలంగా వున్నది మాత్రం మూడనమ్మకమే. ఈ అంధవిశ్వాసంలో బతుకుతున్న వారికి మూడాచారాలకు దూరంగా తీసుకెళ్తామని చెబుతున్న ప్రభుత్వాలు మాటలకే పరిమితం కావడంతో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి దారుణ వార్తలు వెలుగుచూస్తూనే వున్నాయి.

అది ప్రపంచంలో ఎక్కడైనా కానివచ్చు. భారత దేశమే కాదు అటు అభివృద్ది చెందుతున్న దేశాలైనా, అభివృద్ది చెందిన దేశాలైనా ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం పరిపాటిగా మారింది. 20వ శతాబ్దంలోకి మానవుడు వచ్చినా.. మూడాఛారాలు మాత్రం అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప.. వాటి అడ్రస్ గల్లంతైన ఘటనలు మాత్రం అరుదు. తాజాగా చైనాలో ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం మరణించిన తమ కుమారుడి ఆత్మ శాంతించేందుకు షాంగ్జీ రాష్ట్రంలోని ఒక కుటుంబం ఒక మహిళ మృతదేహంతో పెళ్లి జరిపించింది.

కొడుకు పెళ్లికాకుండా బ్రహ్మచారిగా మరణించినందుకు ఈ తంతు జరిపింది. దీనికోసం  ‘వధువు’ కుటుంబానికి రూ.18 లక్షలు ఇచ్చారు. అదేనండీ మరోలా చెప్పాలంటే కన్యాశుల్కం. మామూలుగా అయితే అంతకంటే ఎక్కువే సమర్పించుకోవాలట.అయితే, వారు స్థానికులు కావడంతోపాటు మరణించిన ‘వధువు’ కుటుంబం దీన్ని మంచి సంబంధంగా భావించడంతో తక్కువ మొత్తం ఇచ్చినట్లు చైనా రేడియో ఇంటర్నేషనల్ (సీఆర్‌ఐ) తెలిపింది. పెళ్లి కాకుండా మరణిస్తే శాపం చుట్టుకుంటుందనే విశ్వాసంతో వారికి పెళ్లి జరిపించడం అక్కడ పురాతన సంప్రదాయం.

అయితే ఇది మన దేశంలోనూ హైందవ సంప్రదాయ కుటుంబాలలో నిర్వహిస్తారు. అయితే దీనిని పెళ్లి కాని యువకులు పెళ్లీడు వచ్చిన తరువాత మరణిస్తే.. అతని కుటుంబసబ్యులు జిల్లేడు చెట్టుతో వివాహాలు జరిపిస్తారు. ఇలా చేసిన తరువాతే సదరు యువకుల మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే ఇవి హైందవ సంప్రదాయాలలో భాగంగా నిర్వహిస్తారే తప్ప.. చైనా మాదిరిగా అత్మలకు.. అమ్మాయిల శవంతో మాత్రం వివాహాలు జరిపించరు. పోయినోళ్లు ఎలాగో పోయారు.. ఇన్నాళ్లకు పెళ్లి చేసి.. లక్షల రూపాయలను విధిల్చుకోవడం ఉన్నవాళ్లకు పెనుభారంగా మారడం ఎలా సబబు అవుతుంది.

అయితే చైనాలో పాలీగమీ నెలకోంది అదేనండీ అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య తక్కువగా వుంది. అందుకనే అక్కడి అమ్మాయిలకు.. అబ్బాయిల కన్నా డిమాండ్ అధికంగా వుంది, అబ్బాయిలు సింగిల్స్ డే రోజున వచ్చే ప్రపోజల్స్ ను కూడా అమ్మాయిలు తిరస్కరించేది ఇందుకేనోమో. అక్కడి అబ్బబాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం ఇవ్వాల్సిందే. అదేనండీ కన్యాశుల్కం ఇవ్వాల్సిందే. కాగా ఇలాంటి దురాచారాలపై సంపూర్ణ నిషేధం విధిస్తే తప్ప మార్పు రాదని స్థానిక విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  ghost wedding  weird weddings  China Radio  Posthumous marriage  

Other Articles