Hyperloop One successfully tests high-speed transport propulsion system

Hyperloop one conducts test in nevada

epic high-speed travel, pneumatic ground propulsion, Hyperloop, successful test run, Elon Musk, Hyperloop One, Hyperloop One test-drives sucessful

Humans are about to enter a new era of epic high-speed travel, according to those behind the first-ever track test of a pneumatic ground propulsion system dubbed ‘Hyperloop,’ which has just completed a successful test run in North Las Vegas.

ITEMVIDEOS: భవిష్యత్ రైలు రవాణా.. వాయువేగంమేనా..?

Posted: 05/15/2016 10:32 AM IST
Hyperloop one conducts test in nevada

భవిష్యత్ రవాణా రైలు మార్గమేనా.. అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. అయితే ఇప్పటికే సూపర్ ఫాస్ట్, హైస్పీడ్, రైళ్లను చూసిన ప్రజలకు వాయువేగంతో నడిచే రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానుంది, మామూలు స్పీడు కాదు ఏకంగా విమానం కన్నా వేగంగా వుండబోతుంది ఈ రైల్లో ప్రయాణం. ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది.

గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో..  విస్మయపరిచే  ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన  వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు.

ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Incredible  Physics  Hyperloop  transportation  sucessful Test  

Other Articles