AgustaWestland Scam shadow moves to seas

Agustawestland scam shadow moves to seas

AgustaWestland Scam , Italy, Parliament, Navy, Agusta Scam

The government has sought details on alleged irregularities in the purchase of two naval ships from an Italian firm when the UPA was in power, India Today learnt on Friday, a development that comes against the backdrop of a political storm over the scandal-hit AgustaWestland chopper deal.

వెలుగులోకి అగస్టా స్కాం కన్నా పెద్ద స్కాం

Posted: 05/14/2016 06:04 PM IST
Agustawestland scam shadow moves to seas

ప్రస్తుతం పార్లమెంట్ ను కుదిపేసిన అగస్టా స్కాంను మరిచిపోయేలోపే మరో స్కాం వెలుగులోకి వచ్చింది. ఇది అగస్టా స్కాం కన్నా పెద్దది అని తెలుస్తోంది. ఇది కూడా ఇటలీతో సంబందం ఉండటంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నౌకాదళానికి నాసిరకం ఉక్కుతో తయారు చేసిన ట్యాంకర్ నౌకలు సరఫరా చేసిన ఇటాలియన్ నౌకా నిర్మాణ సంస్థకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు పెద్దపీట వేసినట్టు ఇండియా టుడే కథనంతో ప్రభుత్వం డొంక లాగుతున్నట్టు తెలిసింది. ఈ నావల్ టాంకర్ స్కాంపై రక్షణమంత్రి మనోహర్ పారికర్ గుట్టుగా దర్యాప్తునకు ఆదేశించారని వినవస్తున్నది. ఇది అగస్టా హెలికాప్టర్లను మించిన కుంభకోణమని అంటున్నారు.

2009లో అప్పటి యూపీఏ సర్కారు ఇటాలియన్ కంపెనీ ఫిన్‌కాంటియరీకి రెండు నావల్ ట్యాంకర్ల సరఫరాకు కాంట్రాక్టు ఇచ్చింది. నాసిరకం ఉక్కుతో ట్యాంకర్లు తయారు చేసేందుకు యూపీఏ సర్కారు అనుమతించడంపై ఇప్పుడు సర్కారు దృష్టిపెట్టింది. ఒప్పందం వివరాలను ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు పరిశీలిస్తున్నది. ఈ కుంభకోణాన్ని ఓ నౌకాదళ అధికారి బయటపెట్టినట్టు తెలుస్తున్నది. ఆయుధాల రకం ఉక్కుకు బదులుగా వాణిజ్య అవసరాలకు వాడే ఉక్కుతో ట్యాంకర్ల తయారీకి అప్పటి ప్రభుత్వం ఆమోదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య అవసరాల నిమిత్తం వీటిని కొనుగోలు చేశారు. రష్యా నుంచి ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య వెంబడి ఇండియాకు వస్తుండగా సరికొత్తదైన ఇటాలియన్ ట్యాంకరు అడుగుభాగం పగుళ్లు చూపిందని అంటున్నారు. ఆయుధాల రకం ఉక్కుతో ట్యాంకర్ల సరఫరాకు ఒక రష్యా కంపెనీ ముందుకు వచ్చినా ఇటాలియన్ కంపెనీ ఫిన్‌కాంటియరీపైనే ప్రత్యేక అభిమానం చూపించి నాసిరకం ఉక్కుతో చేసిన ట్యాంకర్లు కొనుగోలు చేశారనేది ప్రధానమైన ఆరోపణ. దీనిపై 2010లో కాగ్ నివేదిక కూడా సర్కారును తప్పుబట్టింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AgustaWestland Scam  Italy  Parliament  Navy  Agusta Scam  

Other Articles