Defamation law stays, free speech no excuse to sully reputation: Supreme Court

Defamation is a criminal offence confirms supreme court

Supreme Court, Justice Dipak Misra, Justice Prafulla C Pant, Under IPC, Defamation law, Rahul Gandhi, Subramanian Swamy, Arvind Kejriwal, freedom of speech and expression

The Supreme Court upheld the constitutional validity of criminal defamation law, which was contested by Rahul Gandhi, Arvind Kejriwal and Subramanian Swamy.

పరువునష్టం నేరపూరిత చర్యే.. సర్వోన్నత న్యాయస్థానం..

Posted: 05/13/2016 09:24 PM IST
Defamation is a criminal offence confirms supreme court

పరువు నష్టం దావా వాక్ స్వతంత్ర్యానికి, భావ ప్రకటన స్వేఛ్చకు ఈ చట్టం విఘాతం కలిగిస్తుందని దీనిని తొలగించాలని వచ్చిన పిటీషన్లపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాటిని తోసిపుచ్చింది, పరువు నష్టం దావా ఇండియన్ పీనల్ కోడ్ కిందకే వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్సష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 499, 500ల కింద రెండేళ్లు జైలు శిక్ష విధించే నిబంధన కాలం చెల్లిందిగా దీనిని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఇవాళ తీర్పు నిచ్చింది.
 
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లను జస్టిస్ ఫ్రఫుల్ల సీ పంత్, దీపక్ మిశ్రా లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాటిని విచారించింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ సహేతుకమైన పరిమితులుంటాయని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రైవేట్ పరువు పరువు నష్టం దావా కేసులో సమన్లు జారీ అయితే ఎనిమిది వారాల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చునని, ఆసమయంలో వారికి రక్షణ ఉంటుదని కోర్టు స్పష్టం చేసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Defamation law  Rahul Gandhi  Subramanian Swamy  Arvind Kejriwal  Under IPC  Supreme Court  

Other Articles