గోమూత్రాన్ని వదలని చంద్రబాబు నాయుడు | Chandrababu Naidu on Cow urine

Chandrababu naidu on cow urine

Cow Urine, AP, Chandrababu Naidu, Tax, గోమూత్రం, చంద్రబాబు, ట్యాక్స్, ఏపి

AP Govt issue notices to some companies who selling Cow Urine for Medical prupose. AP Govt decide TAX on Cow Urine.

గోమూత్రాన్ని వదలని చంద్రబాబు నాయుడు

Posted: 05/13/2016 11:20 AM IST
Chandrababu naidu on cow urine

చంద్రబాబు నాయుడు ఈ మధ్యన తీసుకుంటున్న నిర్ణయాలు మరీ వింతగా అనిపిస్తున్నాయి. ఏకపక్షంగా సాగుతున్న పాలనకు తోడు .. తప్పుడు నిర్ణయాలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం సర్వత్రా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో కష్టాల్లో ఉందని ఎప్పుడూ చెప్పుకునే అయ్యవార్లు తమ దుబారాను తగ్గించుకోవడం తెలియదు కానీ అడ్డగోలుగా దీని మీద పడితే దాని మీద పన్నులు వెయ్యడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇంతకీ తాజాగా అయ్యవార్లు దేని మీద పన్ను వేశారో తెలుసా..? గోమూత్రం మీద. అవును మీరు చదివింది కరెక్టే.. గోమూత్రం మీద పన్ను వేశారు.

ఏపీ వ్యాట్‌ చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం పలు సంస్థలకు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద తయారవుతున్న ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్లే... గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు అందుకున్న గో ఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి.

గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని వాణిజ్య పన్నుల విభాగం తెలిపింది. గోమూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. గోమూత్రంపై ఏపీ వ్యాట్‌యాక్ట్ ప్రకారం 5శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. ఇలా ఏపి సర్కార్ తీసుకున్న అనుచిత నిర్ణయానికి ప్రజల నుండి వ్యతిరేకత రావడం పక్కా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles