ఏపిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ | Good news for unemployees in Andhra Pradesh

Good news for unemployees in andhra pradesh

Anhdrapradesh, AP, Employees, AP, Jobs in AP, ఏపి, నిరుద్యోగులు, ఉద్యోగాలు, జాబ్స్

Andhra Pradesh Govt getting ready to fill all vaccancies in the various departments. APPSC al so getting ready to conduct all exams.

ఏపిలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Posted: 05/13/2016 11:08 AM IST
Good news for unemployees in andhra pradesh

ఏపిలోని నిరుద్యోగులకు తీపి కబురు అందింది. ఏపి సర్కార్ తాజాగా అక్కడ ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను కూడా సంసిద్దం చేస్తోంది. దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి తొలి నోటిఫికేషన్‌ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి సమాచారం అందింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20,250 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో పోలీసు విభాగానికి చెందినవి 8 వేలుకాగా, మిగిలిన 12 వేల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలోనే 1100 ఖాళీలతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ తర్వాత సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఎఎస్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇండెంట్‌లను బట్టి దశల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కమిషన్‌ సిద్ధమవుతోంది. ఇండెంట్‌ అందిన 15 రోజుల్లోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది.
 
తాజాగా ఏపీపీఎస్సీ నవీకరించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. గతానికి భిన్నంగా తొలిసారి ‘వన్‌టైమ్‌ రిజిసే్ట్రషన్‌’ కు ఏర్పాటు చేశారు. ఇందులో డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లకు సంబంధించిన విభాగాన్ని ఓపెన్‌ చేశారు. జూన్‌లో నిర్వహించే పరీక్షలు రాయగోరు అభ్యర్థులు తమ వివరాలతో రిజిసే్ట్రషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన విభాగాన్ని తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయగానే ఓపెన్‌ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1, 2, 4లకు సంబంధించిన సిలబ్‌సలో మార్పులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత సిలబ్‌సపై వచ్చిన 1,234 అభ్యంతరాలను సబ్జెక్టు నిపుణులకు ఏపీపీఎస్సీ పంపించింది. నివేదిక రాగానే మారిన సిలబ్‌సను తెలియజేస్తామని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles