Vyapam scam | Tejaswi Yadav | Madhya Pradesh | Lalu Prasad | JD(U) MLC | BJP | Bihar Deputy Chief Minister

Tejaswi yadav hits back at bjp says jungle raj prevails in delhi

Vyapam scam,Tejaswi Yadav,Madhya Pradesh,Lalu Prasad,JD(U) MLC,BJP,Bihar Deputy Chief Minister,Pathankot terror attack,Gaya road rage,Rocky Yadav,Manorama Devi,Bindi Yadav,RJD,BJP

Launching a counteroffensive against BJP for its 'return of jungle raj' remark, Bihar Deputy Chief Minister Tejaswi Yadav today said if the killing of a youth in a road rage incident symbolised that, then even the national capital was no different

ఎంపీ, హర్యానా, పంజాబ్, ఢిల్లీలు కావా.. జంగిల్ రాజ్..?

Posted: 05/12/2016 10:32 AM IST
Tejaswi yadav hits back at bjp says jungle raj prevails in delhi

బిహార్ అనగానే 'జంగిల్ రాజ్' అని వినిపించే వ్యాఖ్యలపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్ లో ఆటవిక పాలన నడుస్తోందని ప్రతిపక్షాలు పదేపదే విమర్శించడంతో ఆయన కౌంటర్ ఇచ్చారు. బిహార్ ను ప్రతిపక్షాలు జంగిల్ రాజ్ అంటూ ఇటు తమను తాము కించపర్చుకోవడంతో పాటు అటు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాలను కూడా దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తమను తాము గౌరవమర్యాదలు ఇచ్చినప్పుడే.. ఇతరులు మనకు అది ఇస్తారని గుర్త చేశారు.

వేరే రాష్ట్రాలవాళ్లు వచ్చి మనల్ని విమర్శిస్తే.. తామంతా ఐక్యంగా వారిని ఎదుర్కోవాల్సిందిపోయి.. తమను తామె కించపర్చుకుని తాత్కాలిక అనందం అనే బ్రమలో బతుకుతున్నామని ఎద్దేవా చేశారు. అధికార జేడీ(యూ) మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి కొడుకు రాకీ యాదవ్ నడిరోడ్డుపై యువకుడిని కాల్చి చంపాడని ఆరోపణలు రావడంతో విపక్షాలు నితీశ్ కుమార్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బిహార్ లో జంగిల్  రాజ్ పాలన నడుస్తోందని ధ్వజమెత్తాయి. దీనిపై తేజశ్వి యాదవ్ ఘాటుగా స్పందించారు.

'బిహార్ లో జరిగిన ఘటన జంగిల్ రాజ్ కు అద్దం పడుతుందన్న విమర్శలపై మండిపడ్డారు. ఢిల్లీలో ఇంతకంటే ఎక్కువగా రోడ్లపై దారుణాలు జరిగాయి. అది జంగిల్ రాజ్ కాదా? మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణంలో పాత్రికేయులతో పాటుగా అనేకులు అసువులు భాసారు.. అది జంగిల్ రాజ్ కాదా..? పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, జాట్ల ఆందోళన సందర్భంగా మహిళలపై అత్యాచారాలు.. జంగిల్ రాజ్ పాలనకు ఉదాహరణలు కాదా?' అని తేజశ్వి యాదవ్ ఆవేశంగా ప్రశ్నించి బీజేపి నేతల నోళ్లకు తాళాలు వేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vyapam scam  Tejaswi Yadav  Madhya Pradesh  Lalu Prasad  JD(U) MLC  BJP  Bihar Deputy Chief Minister  

Other Articles