Trust Vote Over, Rawat Holds No Grudges, Sibal Wants PM's Apology

Sack minister who advised pm says kapil sibal

budget session, lok sabha, rajya sabha, lok sabha end session, lok sabha adjourned, uttarakhand, supreme court, uttarakhand high court, Harish rawat, kapil sibal, president rule, sack advised minister, narendra modi, sonia gandhi, rahul gandhi

Congress member Kapil Sibal has demanded an apology from Prime Minister Narendra Modi and sought ouster of the minister who advised President's rule in uttarakhand

‘సలహా ఇచ్చిన కేంద్రమంత్రిని సాగనంపండీ..’

Posted: 05/12/2016 11:02 AM IST
Sack minister who advised pm says kapil sibal

ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ బేషరుత్తుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన కేంద్రమంత్రిని ముందుగా పదవీఛ్యుతుడి చేయాలని భీష్మించింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ లో  బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపి కుయుక్తులను, అధికారం కోసం అర్రలుచాచి కుతంత్రాలు చేస్తున్న వైనాన్ని అసహించుకుంటున్నారని అన్నారు.

'కాంగ్రెస్ రాజకీయ  బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. ఎలాంటి బేరసారాలు తెరవెనుక జరిగాయో ప్రజలందరికీ అర్థమైయ్యిందని ఆయన విమర్శించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా.. ఈ విషయంలో చర్యలు తీసుకోమ్మని సర్వోన్నత న్యాయస్థానం అటు కేంద్రానికి మెట్టికాయలు వేస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం అధికారమే పరమావధి అన్నట్లుగా కేంద్రంలోని మోగా సర్కార్ వ్యవహరిస్తుందని, ఈ నేపథ్యంలోనే తమ ఎమ్మల్యేలను ప్రలోభాలకు గురిచేసి వారిని తమ పక్షాన చేర్చుకుని కుత్రంతానికి పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు.  మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని కానీ వాటి అమలుకు చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని కపిల్ సిబల్ ధ్వజమెత్తారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand  supreme court  Harish rawat  kapil sibal  president rule  

Other Articles