70 ఏళ్ల ముసడావిడకు పండంటి బాబు | 70-Year-Old Woman In Punjab Gives Birth To First Baby

70 year old woman in punjab gives birth to first baby

Punjab, Daljinder Kaur, IVF teatment, హర్యానా, పంజాబ్

A woman who gave birth at the age of 70 said Tuesday she was not too old to become a first-time mother, adding that her life was now complete. Daljinder Kaur gave birth last month to a boy following two years of IVF treatment at a fertility clinic in the northern state of Haryana with her 79-year-old husband.

70 ఏళ్ల ముసడావిడకు పండంటి బాబు

Posted: 05/11/2016 12:09 PM IST
70 year old woman in punjab gives birth to first baby

వయస్సు అనేది శరీరానికి కానీ.. మనసుకు కాదు అని మామూలుగా అంటుంటాం. నిజమే పాతికేళ్ల కుర్రాడు కూడా చెయ్యలేని పనులను పండు ముసలి చేస్తున్నాడు అంటే వారి మనసు అంత యంగ్ గా ఉంది అని అర్థం. తాజాగా ఓ జంట గురించి మీడియా కోడై కూస్తోంది. అంతలా వాళ్లు ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా...? వాళ్లు ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అదేంటి బిడ్డ పుడితే వాళ్లకు అంత పాపులారిటీనా అని అనుకుంటున్నారేమో కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ తల్లితండ్రుల వయస్సు 70పై చిలుకు.

పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో నివ‌సించే మోహింద‌ర్ సింగ్ ద‌ల్జీంద‌ర్ కౌర్ దంప‌తుల‌కు కూడా 46 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో పిల్లలు లేని లోటు ఎంతగానో బాధించింది. పిల్లల కోసం వారు మొక్కని దేవుడంటూ లేడు…ఎక్కని గుడి మెట్టు అంటూ లేదు. ఎట్టకేల‌కు వారి ప్రార్థన‌లు విన్న భ‌గ‌వంతుడు క‌రుణించాడు. పండంటి మ‌గ‌బిడ్డను ద‌ల్జీంద‌ర్ కౌర్‌కు ప్రసాదించాడు. కాస్త లేట్‌గైనా లేటెస్ట్ టెక్నాల‌జీతో పండంటి మ‌గ‌బిడ్డకు జ‌న్మనిచ్చింది ద‌ల్జీంద‌ర్ కౌర్ అనే 70 ఏళ్ల బామ్మ‌. రెండేళ్ల పాటు ఐవీఎఫ్ చికిత్స చేయించుకున్న దల్జీందర్ కౌర్ తన 70వ ఏట ఏప్రిల్ 19న మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మా ఇంటికి వారసుడొచ్చాడంటూ తెగ సంబరపడిపోతున్నారు ఆ వృద్ధ దంపతులు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు నేషనల్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab  Daljinder Kaur  IVF teatment  హర్యానా  పంజాబ్  

Other Articles