Naidu family's Heritage Foods director named thrice in Panama Papers

Heritage foods director named thrice in panama papers

Panama papers, Motaparti Siva Rama Vara Prasad, Heritage Foods MD, Chandrababu naidu, Mossack Fonseca, motaparti sunil, south news, telangana news,

The Panama Papers mentions the name of industrialist Motaparti Siva Rama Vara Prasad thrice, for having offshore companies in Ghana and Togo in Africa.

పనామా పేపర్స్ లో హెరిటేజ్ డైరెక్టర్ పేరు..

Posted: 05/11/2016 12:19 PM IST
Heritage foods director named thrice in panama papers

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పేపర్స్‌ తాజాగా విడుదల చేసిన జాబితాతో హెరిటేజ్ ఫుడ్స్ కూడా తన పేరును నమోదు చేసుకుంది. పనామా పేపర్స్ జాబితా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం నిర్వహిస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ మోటపర్తి శివరామ వర ప్రసాద్‌ పేరు బహిర్గతం కావడమే ఇందుకు కారణం అవుతోంది. ఎంపీ హోల్డింగ్స్‌ అసోసియేట్స్‌, బాలీవార్డ్‌ లిమిటెడ్‌, బిట్‌ కెమీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీలతో హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌కు సంబంధం ఉన్నట్లు తేలింది. పనామాలో మూడుసార్లు ప్రసాద్‌ పేరు ప్రస్తావవను వచ్చింది. బ్రిటీస్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, పనామా, ఈక్వెడార్‌లో మూడు కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా పన్నులు ఎగవేశారని ఆరోపణలు ఉన్నాయి.

దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. ఎంపీ హోల్డింగ్స్‌ అసోసియేట్స్‌, బాలీవార్డ్‌ లిమిటెడ్‌, బిట్‌ కెమీ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీలతో సంబంధమున్న ఆయన పేరు పనామా పేపర్స్‌లో మూడు సార్లు ప్రస్తావనకు వచ్చిందని తన కథనంలో తెలిపింది. వర ప్రసాద్‌ పేరు బయటకు రావడంతో... చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితిలో పడినట్లు మారినట్లు ఆ పత్రిక వెల్లడించింది. వరప్రసాద్‌ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపితే.... ఆయన బినామీ ఎవరో తెలిసే అవకాశం ఉందంటూ ఆంగ్ల పత్రిక వార్త కథనం ప్రచురించింది.

అటు వరప్రసాద్‌ పేరు బయటకు రావడంతో... టీడీపీ నేతల్లోనూ ఆందోళన మొదలైనట్లు సమాచారం. అలాగే ప్రసాద్‌ కుమారుడు సునీల్‌ కూడా బిట్‌ కెమీ వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పనామా వెల్లడించింది. సునీల్‌.. అమెరికా, హైదరాబాద్‌లో స్టార్టప్‌ కంపెనీల్లో ఈ డబ్బును ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రసాద్‌ ప్రవాస భారతీయుడు కాగా... హైదరాబాద్‌లో కొన్ని కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటు ఘనా, టోగో, అమెరికాలో ప్రసాద్‌కు వ్యాపారాలు ఉన్నాయి. ప్రసాద్‌ 2014 నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌కు కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.

పనామా లిస్ట్‌లో తన పేరు రావడంపై ప్రసాద్‌ స్పందించారు. తాను ప్రవాస భారతీయుడునని... ఘనాకు చెందిన వాడిగా చెప్పుకోచ్చారు. గత 30 ఏళ్లుగా విదేశాల్లో నివసిస్తున్నట్లు చెప్పిన ఆయన విదేశాలలో తాను వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు పనామాలోనూ పరిశ్రమలు వున్నాయని చెప్పారు, తాను 1985 నుంచి వ్యాపారం ప్రారంభించానని, ప్రస్తుతం తనకు అనేక వ్యాపారాలున్నాయని చెప్పారు. కాగా ఘనా, టోంగోలోని తన వ్యాపారాలలో అనేక వ్యాపారాలున్నాయని వాటిలో అధికంగా సిమెంట్ పరిశ్రమలు వున్నాయని ఆయన చెప్పినట్లు అంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

తనకు బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్‌లో కూడా కంపెనీలు ఉన్నాయన్నారు. అయితే మోస్సాక్ ఫాన్సెకా తన ఏజెంట్లా అన్న ప్రశ్నకు తనకు వాటి గురించి తెలియదని, కంపెనీ అకౌంటంట్లు వాటిని చూసుకుంటారని చెప్పారు. పనామా వ్యవహారాన్ని కంపెనీ సిబ్బంది, లాయర్లు చూసుకొంటారని చెప్పారు. తన వ్యాపార లావాదేవీలన్నీ చట్టబద్దంగా ఉన్నాయన్నారు. కాగా ప్రసాద్ తనయుడు సునీల్ కూడా ఈ అంశమై స్పందించారు. తమ వ్యాపార లావాదేవీలన్ని సక్రమమనే చెప్పుకోచ్చిన ఆయన భారత్ లోని హైదరాబాద్ స్టార్ట్ అప్ లలో ఆయన ఆరు మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారని సమాచారం. కాని పనామా ప్రకటించిన లిస్ట్‌లో మాత్రం పన్ను ఎగవేసే కంపెనీలతో సంబంధం ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. మరి దీనిపై కూడా కేంద్ర ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతుందా..? నిజాలను నిగ్గుతెలుస్తుందా..? అన్న విషయాలు వేచి చూడాల్సిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panama Papers  Motaparti Siva Rama Vara Prasad  Heritage Foods MD  

Other Articles