మోడీ సర్టిఫికేట్లు ఒరిజినల్: దిల్లీ వర్సిటీ | Delhi University clarifies Modi was awarded BA degree in 1979

Delhi university clarifies modi was awarded ba degree in 1979

Modi, Degree, Delhi University, AAP, kejriwal, Congress, Modi Degree, మోదీ,డిగ్రీ, దిల్లీ వర్సిటీ

After all the brouhaha over Prime Minister Narendra Modi's so-called 'fake certificate', Delhi University (DU) came forward today and clarified that the PM's records have been maintained in DU and he cleared his BA exams from the University in 1978. He was awarded the degree in 1979.

మోడీ సర్టిఫికేట్లు ఒరిజినల్: దిల్లీ వర్సిటీ

Posted: 05/11/2016 07:59 AM IST
Delhi university clarifies modi was awarded ba degree in 1979

మోడీ డిగ్రీ సర్టిఫికెట్ పై విదాదం నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీ దీనిపై స్పందించింది. ప్రధాని కి ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినలేనని పేర్కొంది. సర్టిఫికెట్ లో దొర్లిన చిన్న తప్పు కారణంగా దీనిపై వివాదం నెలకొందని పేర్కొంది. నరేంద్ర మోడీ 1978లోనే ఢిల్లీ వర్శిటీలో డిగ్రీపూర్తి చేశారని.. 1979లో ఆయన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకున్నట్లు వర్శిటీ పేర్కొంది. గత కొన్నిరోజుల నుంచి నరేంద్ర మోడీ విద్యార్హతలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధాని డిగ్రీ సర్టిఫెకెట్లు నకిలీవని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రంలో నెంబర్ 2 గా ఉన్న మంత్రి అరుణ్ జైట్లీ దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించడం.. మోడీ విద్యార్హతలపై వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీ కూడా దీనిపై స్పందించి.. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ కు క్లీన్ చీట్ ఇచ్చింది. కాగా ఢిల్లీ వర్శిటీ నుంచి ప్రకటన వెలువడగానే ఆప్ కు చెందిన పలువురు నేతలు ఢిల్లీ వర్శిటీకి వచ్చి ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకున్నారు. ఢిల్లీ వర్శిటీ ప్రకనటపై రేపు స్పందిస్తామని ఆప్ నేతలు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles