We require more than 70,000 judges to clear pending cases: CJI TS Thakur

More than 70000 judges needed to clear pending cases in india says cji

cji, chief justice of india, ts thakur, judges, justice, courts, judges shortage, shortage of judges

Continuing to express concern over low judge-population ratio in the country, CJI TS Thakur said access to justice was a fundamental right and governments cannot afford to deny it to the people.

సత్వర న్యాయం కావాలంటే.. 70వేల మంది న్యాయమూర్తులు కావాలి..

Posted: 05/09/2016 03:12 PM IST
More than 70000 judges needed to clear pending cases in india says cji

దేశంలో జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించాలన్నది తమ ఉద్దేశ్యమే అయినా.. అనేక కేసులు అపరిష్కృతంగా వున్నందున అలా చేయలేకపోతున్నామని అవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో ఓ సదస్సులో జస్టిస్ ఠాకూర్ ప్రధాని మోదీ సమక్షంలో ఇదే అంశాన్ని ప్రస్తావించి కంటతడి పెట్టుకున్న ఆయన తాజాగా ఒడిశా హైకోర్టు సర్క్యూట్ బెంచ్ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడుతూ.. జడ్జీల కొరత అంశాన్ని మళ్లీ లేవనెత్తారు.

జనాభా పెరుగుదల రేటు ప్రకారం...పెండింగ్ కేసుల పరిష్కారానికి 70 వేల మందికిపైగా జడ్జీల అవసరముందన్నారు. అలా చేసినప్పుడే అనేక సంవత్సరాలుగా వున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యం వల్ల అప్పటికప్పుడు పరిష్కారం లభిస్తే న్యాయం అనిపించే అంశం కూడా కాలవ్యవధి వల్ల అన్యాయంగా మారాల్సి వస్తుందన్నారు. ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన పాలకులు అ దిశగా అడుగులు వేస్తే తప్ప న్యాయం పోందాల్సిన హక్కును ప్రజలు సాధించలేరన్నారు.

‘జడ్జీల నియామకాలను సత్వరం చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. అయితే ఈ నియామకాలతో సంబంధమున్న యంత్రాంగం మాత్రం చాలా నిదానంగా కదులుతోంది’ అని తెలిపారు. హైకోర్టు జడ్జీలకు సంబంధించి 170 ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లామన్నారు.న్యాయం పొందడమనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని వారు పొందకుండా ప్రభుత్వాలు నిరాకరించలేవని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు.  

జడ్జీల కొరత ప్రధాన సవాలు.. ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో జడ్జీల కొరత ఒకటని ఆయన అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో మంజూరైన జడ్జీల పోస్టులు 900 కాగా.. వాటిలో 450 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరముందన్నారు. జనాభా, జడ్జీల నిష్పత్తి మధ్య భారీ అంతరాన్ని 1987లో భారత లా కమిషన్ అప్పట్లోని పెండింగ్ కేసుల పరిష్కారానికి 44 వేల మంది జడ్జీలు అవసరమని సూచించిందన్నారు. ప్రస్తుతం కేవలం 18 వేల మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు.  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఆర్థికసాయం చేస్తామన్నారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cji  chief justice of india  ts thakur  judges  justice  courts  judges shortage  shortage of judges  

Other Articles