దేవి డెత్ మిస్టరీ వీడింది | Devi died in accident, no proof of foul play: Hyderabad police

Devi died in accident no proof of foul play hyderabad police

Police, Devi, Devi Death, Hyderabad Police, Devi Reddy, దేవి రెడ్డి, హైదరాబాద్, దేవి రెడ్డి అనుమానాస్పద మృతి

After analysing evidence Hyderabad police has concluded that 21-year-old B.tech student Devi Reddy's death last Sunday was due to injuries suffered in the car crash.

దేవి డెత్ మిస్టరీ వీడింది

Posted: 05/09/2016 07:40 AM IST
Devi died in accident no proof of foul play hyderabad police

హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో జరిగిన ప్రమాదంలో దేవీ మృతి మిస్టరీ వీడింది. ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీని కావాలని ఎవరో చంపారని, చంపి ప్రమాదంగా సృష్టించారని దేవీ తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఈ విషయం సీరియస్ అయింది. రాష్ట్రం మొత్తం ఈ విషయం చర్చనీయాంశమైంది. పలువురిపై పలు అనుమానాలతో దేవీ మృతి మిస్టరీగా మారింది. దీనిని ఛేదించడానికి పోలీసులు స్పెషల్ ఇన్వేస్టిగేషన్ మొదలుపెట్టారు. అయితే ఈ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. పూర్తి వివరాలను సీపీ మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఆయన మాటల్లోనే... ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించాకే ప్రమాదమని తేల్చామని చెప్పారు. అనుమానితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించామన్నారు. సంఘటన జరిగిన రోజు దేవి, భరత సింహారెడ్డి హాజరైన పార్టీకి వచ్చిన వారందరి కాల్ డేటాన్ విశ్లేషించామన్నారు. ఆరోజు పార్టీకి ఎవరెవరు వెళ్లారో, ఏం జరిగిందో అంతా పరిశీలించామని చెప్పారు. దేవీ శరీరంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో ఏర్పడినవేనన్నారు. ఈవిషయమై మెడికల్, ఫోరెన్సిక్, సైంటిఫిక్ నిపుణులను సంప్రదించామన్నారు. కాగా, పబ్ లో పార్టీకి వారం ముందు నుంచే భరత్ సింహారెడ్డి ప్లాన్ చేశాడని, ఆ పార్టీకి వస్తావా అని అప్పుడే దేవినీ అడిగారని చెప్పారు. మరో స్నేహితురాలు సోనాలి కూడా ఆ పార్టీకి వస్తానని చెప్పడంతో దేవి కూడా ఆ పార్టీకి వెళ్లేందుకు అంగీకరించిందన్నారు. భరత్ సింహారెడ్డి మద్యం తాగి కారు డ్రైవ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని చార్జీషీట్ దాఖలయ్యే వరకు విచారణ జరుపుతామని సీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles