Justin Bieber, Desiigner Brawl in Club After Rapper Stomps on his Foot

Justin bieber feels misunderstood after his latest nightclub fight

Justin Bieber, Justin Bieber Desiigner, Desiigner, Justin Bieber pushes Desiigner, Justin Bieber shoves Desiigner, justin bieber purpose world tour, Justin Bieber Purpose, Justin Bieber fight, Justin Bieber designer, pop singer, world news

Justin Bieber shoved rapper Desiigner at the 1OAK nightclub in New York City on Thursday night after Kanye West's protégé stepped on him during a performance.

ITEMVIDEOS: సింగర్ల సిగపట్లే కాదు.. గానగంధర్వుల గళ్లాపట్లు కూడా..!

Posted: 05/07/2016 01:15 PM IST
Justin bieber feels misunderstood after his latest nightclub fight

పోటీ ప్రపంచం.. అందులోనూ ప్రతి చిన్న విషయంలోనూ పోటీ.. చివరాఖరికి ఈ పోటీ సోషల్ మీడియాలో లైక్ ల విషయం వరకు చొరబడింది. ఈ నేపథ్యంలో మహిళా సెలబ్రిటీలు అడపా దడపా సిగపట్లు పడుతుంటారు. సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని ఈ మద్య సన్నిలీయోన్ ను అక్కడి నటీమణులు తూర్పారబట్టారు. అది శృతిమించిన స్థాయి వరకు వెళ్లింది. దాంతో సన్నీలియోన్ తో ఎందుకోచ్చిన గొడవ అనుకుందో ఏమో తెలియదు కానీ.. నటి కొంచెం తగ్గడంతో వివాదానికి పుల్ స్టాప్ పడింది.

కాగా తాజాగా గానగంధ్వులుగా అభివర్ణించబడే కెనడా పాప్ సింగర్లు కూడా గళ్లాపట్లు పట్టుకున్నారు. అదేంటి అంటారా..? వివాదాలలో మునిగి తేలడం కొత్తకాని పాప్ సూపర్ స్టార్ జస్టిన్ బీబర్ మరోసారి గొడవల్లో తలదూర్చాడు. ఓ క్లబ్బులో నైటౌట్ సందర్భంగా యువ ర్యాపర్ 'డిజినర్'తోతగువుకు దిగాడు. ఈ గొడవ క్లబ్బులో రచ్చరచ్చ చేసింది. బ్రూక్లిన్ లో తన కన్సర్ట్ ముగిసిన అనంతరం న్యూయార్క్ లోని వన్ ఓక్ క్లబ్బుకు 22 ఏళ్ల బీబర్ వెళ్లాడు. అక్కడ హిప్ హాప్ సింగర్ డిజినర్ ప్రదర్శన ఇస్తున్నాడు.

అతను పాడుతూ.. చిందులు వేస్తూ వేదిక మీద నుంచి దిగి.. జనంలో కలియదిరిగాడు. ఈ క్రమంలో వీఐపీలకు కేటాయించిన సీట్ల మద్యకు వచ్చి తన ప్రదర్శనతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే వున్న బీబర్ వద్దకు అతను దూసుకెళ్లాడు. అతని వద్ద చిందులు తొక్కుతూ.. అతని కాళ్లను పలుసార్లు తొక్కాడు. అయితే అప్పటికే క్లబ్ కిక్కిరిసిపోవడం.. అదీ కాక తన కాలును పదే పదే తొక్కడం.. వీటిలో ఏది నచ్చలేదో కానీ జస్టిన్ బీబర్ తన సహజత్వాన్ని ప్రదర్శించాడు.

చిరాకుపడ్డ బీబర్.. డిజినర్ ను  గట్టిగా తోసేశాడు. ఇది చిన్నపాటి గొడవకు దారితీసి.. క్లబ్బులో రభస చేసింది. జనంతో కిక్కిరిసిన క్లబ్బులో ఈ ఘటనకు జరగడం.. దీంతో  డిజినర్ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేయడంతో క్లబ్ లోని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న వారు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. క్లబ్ యాజమాన్యం మాత్రం ముందుజాగ్రత్త చర్యగా తమ బధ్రతా సిబ్బందితో డిజినర్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా హాలీవుడ్ గాసిప్ వెబ్ సైట్ టీఎంజెడ్ పబ్లిష్ చేసింది. ప్రస్తుతం ర్యాపర్ కేన్ వెస్ట్ బృందంలో పనిచేస్తున్న 19 ఏళ్ల డిజినర్ కు క్షమాపణలు చెప్పాలని అయన అబిమానులు డిమాండ్ చేస్తుండగా, ఈ ఘటనపై బీబర్ ఇంతవరకు స్పందించలేదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justin Bieber  Desiigner  club  pop singer  world news  

Other Articles