కుంభమేళాలో విషాదం.. 9 మంది మృతి | 9 dead as tents collapse due to heavy storms in Kumbh Mela

9 dead as tents collapse due to heavy storms in kumbh mela

Kubha Mela, Madhya Pradesh, Simhastha Kumbha Mela, Ujjain, ఉజ్జయిని, కుంభమేళా, మధ్యప్రదేశ్

Around 7 people were killed and over 100 injured when tents erected at the Simhastha Kumbha Mela in Ujjain collapsed due to heavy rains and storm. Injured were rushed to the district hospital.Lakhs of people had gathered for the holy bath at the ghats in Ujjain, when tents erected at the mela collapsed, creating panic.

కుంభమేళాలో విషాదం.. 9 మంది మృతి

Posted: 05/06/2016 09:15 AM IST
9 dead as tents collapse due to heavy storms in kumbh mela

మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అక్కడ బలమైన ఈదురుగాలు, ఉరుములుమెరుపులతో కూడిన వర్షం కురవడంతో నష్టం వాటిల్లింది. కుంభమేళాకు ఏర్పాటు చేసిన భారీ టెంట్లు, స్వాగత తోరణాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, మరో 90 మందికి తీవ్రగాయాలయ్యాయని ఉజ్జయిని జిల్లా కలెక్టర్ కవీంద్ర కియావత్ తెలిపారు. కుంభమేళాలో భాగంగా శుక్రవారం వైశాఖ కృష్ణ షాహీ స్నాన్ నిర్వహించనున్న నేపథ్యంలో కుంభమేళాకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

భయానక గాలులతో కూడిన వర్షానికి కుంభేమేళాలో ఏర్పాటు చేసిన అన్ని వసతులు నాశనమయ్యాయి. రంగంలోకి దిగిన సహాయ బృందాలు కూలిన టెంట్లను తొలగించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కూలిన టెంట్ల కింద చిక్కుకుపోయినవారి గురించి అన్వేషిస్తున్నారు. వాతావరణం సహకరించకపోవడంతో సహాయ చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉండాసా ప్రాంతంలో పిడిగుపడి ఓ మహిళ మృతి చెందారని జిల్లా ఎస్పీ మనోహర్ వర్మ తెలిపారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, ఈ నెల 9న కుంభమేళాలలో భాగంగా రెండవ షాహీ స్నాన్ నిర్వహించనున్నారు. దీనికి మరింత భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles