భారతపటాన్ని తప్పుగా ముద్రిస్తే 100కోట్ల ఫైన్ | Wrong depiction of India map could invite fine up to Rs 100 cr

Wrong depiction of india map could invite fine up to rs 100 cr

India, India Map, Fine for Indian Map, Wrong Depiction, భారత్ పటం, భారతదేశం పటం

Wrong depiction of the map of India could soon land violators behind bars, with a maximum term of seven years and a fine up to Rs 100 crore. The draft Geospatial Information. Regulation Bill, 2016 states: “Whoever depicts, disseminates, publishes or distributes any wrong or false topographic information of India including international boundaries in contravention of section 6, shall be punished with a fine ranging from Rupees ten lac to Rupees one hundred crore and/or imprisonment for a period up to seven years.”

భారతపటాన్ని తప్పుగా ముద్రిస్తే 100కోట్ల ఫైన్

Posted: 05/06/2016 09:28 AM IST
Wrong depiction of india map could invite fine up to rs 100 cr

భారతదేశం పటంలొ కొన్ని సార్లు జమ్ము కాశ్మీర్ కనిపించదు.. కొన్ని సార్లు ఈశాన్య రాష్ట్రాలు కనిపించవు. మరి మన భూభాలు ఎక్కడి దాకా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనే దాని మీద ఇక నుండి క్లారిటీ ఉంటుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించడమో, ప్రచురించడమో చేస్తే జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదు! ఈమేరకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల వరకు భారీ జరిమానా విధించేందుకు ‘ది జియోస్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ రెగ్యులేషన్‌ బిల్లు-2016’ డ్రాప్ట్‌ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సామాజిక మాధ్యమాల్లో జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో, అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనాలో భాగంగా ఉన్నట్లుగా పటాలు ప్రదర్శితమవుతుండటంతో వీటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ కఠిన చర్యకు ఉపక్రమించింది.

‘‘ఇంటర్నెంట్‌ వేదికలు, ఆన్‌లైన్‌ సర్వీసులతోపాటు మరెక్కడైనాగానీ ఎవరైనా భారత భౌగోళిక పటానికి సంబంధించి అంతర్జాతీయ సరిహద్దులు సహా తప్పుడు, అబద్ధాలతో కూడిన అంశాలను చిత్రీకరించినా, ప్రదర్శించినా, ప్రచురించినా, పంపిణీ చేసినట్లు కనుగొన్నా.. చట్టప్రకారం రూ. కోటి నుంచి రూ100 కోట్ల వరకు జరిమానా, ఏడేళ్ల జైలు శిక్షకు గురౌతారు’’ అని డ్రాప్ట్‌లో పొందుపరిచారు. సాక్షాత్తు ట్విటర్‌ సైట్‌ ఇటీవల కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రహితంగా భారత భౌగోళిక పటాన్ని ప్రదర్శించింది. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేయడంతో సరిచేసింది. మొత్తానికి చాలా కాలానికి అందరిని భయపెట్టేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల్లో భారతదేశ పటాన్ని ఖచ్చితంగా కేంద్రం సూచించినట్లే ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles