Tamilnadu CM Jayalalitha release party Manifesto for Elections

Tamilnadu cm jayalalitha release party manifesto for elections

Tamilnadu, Jayalalitha, AIADMK, AIADMK Manifesto, జయలలిత, ఎఐఎడిఎంకె

Going full steam on the populist route, AIADMK general secretary and Chief Minister Jayalalithaa announced a slew of freebies and welfare measures to stake her claim for a successive term in office. Releasing the AIADMK’s election manifesto at Perundurai in Erode district — the native of Dravidian icon Periyar

జయలలిత ‘ఫ్రీ’ మేనిఫెస్టో

Posted: 05/06/2016 09:07 AM IST
Tamilnadu cm jayalalitha release party manifesto for elections

ఎన్నికలు వస్తే తమిళనాట హామీలు, హడావిడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడులో జరిగినంత రాజకీయం, ఉచిత హామీలు ఎక్కడా కూడా ఉండవని అనుకుంటా. తాజాగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో తాము గెలిస్తే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఉచితంగా మొబైల్ ఫోన్లు అందిస్తామని, మహిళలకు 50% రాయితీపై స్కూటర్లనూ అందిస్తామని పేర్కొంటూ అధికార అన్నా డీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత పలు ‘ఉచిత’ హమీలను ప్రకటించారు. పొంగల్ పండుగ సమయంలో కో-ఆప్టెక్స్ నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి రూ.500 విలువచేసే కూపన్లు పంపిణీ చేస్తామన్నారు.

మేనిఫెస్టోలోని మరికొన్ని ప్రధాన అంశాలు..
2015-2021 వరకు రైతులకు రూ.40 వేల కోట్ల పంట రుణాలు అందజేత. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ పూర్తిగా తగ్గింపు
పశువుల కోసం మెడికల్‌ షాపులు, శాఖల ఏర్పాటు. పాలు నిల్వ ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీజర్ల ఏర్పాటు
అన్ని ఆస్పత్రుల్లోనూ ఐసీయూల ఏర్పాటు. మహిళలకు ఫుల్‌ బాడీ చెకప్‌ పథకం అన్ని జిల్లాలకూ విస్తరణ. వృద్ధులకు అన్ని ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలల్లో ఉచితంగా వైద్యం. గర్భిణులకు ఇచ్చే రూ.12 వేల భత్యం రూ.18 వేలకు పెంపు
డాక్టర్‌ అంబేద్కర్‌ ఆశయ లక్ష్యం కోసం రూ.5 కోట్ల వ్యయంతో ప్రత్యేక ఫౌండేషన ఏర్పాటు
చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న విద్యుత్ 200 యూనిట్లకు పెంపు. మరమగ్గాలు నేసే చేనేత కార్మికులకు 750 యూనిట్ల ఉచిత విద్యుత్.
ప్రభుత్వ కేబుల్‌ టీవీ కనెక్షన ఉన్నవారందరికీ ఉచితంగా సెట్‌టాప్‌ బాక్స్‌ పంపిణీ
..కాగా, తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోతో పాటు త్వరలో పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జయ ఆ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. పుదుచ్చేరిలోని నాలుగు రీజియన్లకు చెందిన ప్రజలు మెప్పించేలా, నాలుగు ప్రాంతాలను సమాన దృష్టితో అభివృది చేసేలా ఈ మేనిఫెస్టోను తయారు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles