Vijay Mallya resigns from Rajya Sabha, says ‘will not get fair trial or justice in India’

Vijay mallya resigns from rajya sabha

vijay mallya, vijay mallya resigns, vijay mallya resigns from rajya sabha, rajya sabha, rs, mallya, mallya resignation, Rajya Sabha, king fisher, justice, london

Liquor baron Vijay Mallya, whose passport has been revoked by the government, on Monday resigned from the Rajya Sabha.

వేటుకు ముందే రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా

Posted: 05/02/2016 09:00 PM IST
Vijay mallya resigns from rajya sabha

విందులు, వినోదాలు, సరదాలు, సరసాలు, విలాసాలు అన్నింటినీ ఒక దగ్గెర కలగలిపితే వినిపించే పేరు విజయ్ మాల్యా, దేశంలోని బ్యాంకుల నుంచి తొమ్మిది వేల పైచిలుకు కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకుని.. బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త ఆయన. ప్రజాధనంతో విలాసాలను, విదేశాలలో ఆస్తులను కొనుగోలు చేసిన విజయ్ మాల్యా తనపై ఎగువ సభలో వేటు పడుతుందని ముందుగానే పసిగట్టిన ఆయన.. హుందగా వుండాలని తానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు రాజ్యసభ చైర్మన్కు రాజీనామా లేఖను పంపినట్లు మాల్యా సోమవారం ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. బ్యాంకులకు రూ. 9000 కోట్ల ఎగవేతకు పాల్పడిన మాల్యాపై చర్య తీసుకోవాలని రాజ్యసభ నైతిక విలువల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో మాల్యానే రాజీనామా సమర్పించడం గమనార్హం. మాల్యా వ్యవహారంపై కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ నేతృత్వంలో నైతిక విలువల కమిటీ గతవారం సమావేశమై.. ఆయన నుంచి వివరణ కోరిన సంగతి తెలిసిందే.

ఇందుకు మాల్యాకు వారం రోజులు గడువు ఇచ్చింది. మంగళవారం కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో వేటు తప్పదని భావించిన మాల్యా తనకు తానుగా రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ వ్యవహారంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న మాల్యాను వెనక్కి పంపాలని కోరుతూ గతవారం భారత ప్రభుత్వం బ్రిటన్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై మాల్యా మాట్లాడుతూ ఇప్పట్లో తనకు భారత్కు వచ్చే ఉద్దేశం లేదని వెల్లడించారు. అంతేకాదు భారత్ లో తనపై నిష్పక్షపాత విచారణ జరగదని, తనకు న్యాయం కూడా ఏ కోశాన జరగదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  resigns  Rajya Sabha  king fisher  justice  london  

Other Articles