Uttarakhand crisis: Harish Rawat accepts he is in video of sting operation, denies any wrongdoing

Yes i am present in that cd what is wrong

harish rawat, uttarakhand, uttarakhand sting video, harish rawat horse trading sting, uttarakhand news, uttarakhand crisis, india news, latest new

The deposed Uttarakhand chief minister, who had earlier dismissed the video as fake, said that meeting a journalist was not a crime.

ITEMVIDEOS: ఔను.. ఆ వీడియోలో వున్నది నేనే.. తప్పేంటి..?

Posted: 05/02/2016 01:29 PM IST
Yes i am present in that cd what is wrong

ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. ఇన్నాళ్లు తనపై చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ ఫేక్ అంటూ బుకాయించిన హరీష్ రావత్ ఔను అ సీడిలో వున్నది నేనే అంటూ స్టింగ్ అపరేషన్ విషయమై సంచలన అంగీకారం చేశారు. ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ రెబల్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు భావిస్తున్న స్టింగ్ ఆపరేషన్‌ సీడీలో తాను ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జర్నలిస్టుతో అప్పటి సీఎం రావత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌ కలకలం రేపింది. ఓ ప్రైవేటు న్యూస్ చానెల్ ఎడిటర్‌ ఈ స్టింగ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ సీడీ కాపీలను కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు మీడియాకు పంపారు. స్టింగ్ ఆపరేషన్‌కు పాల్పడిన జర్నలిస్టుతో తాను సమావేశమైన విషయం వాస్తవమేనని రావత్ తాజాగా స్పష్టం చేశారు.

'ఓ జర్నలిస్టుతో సమావేశం కావడం నేరమా? అప్పటికీ సాంకేతికంగా అనర్హత పడిన ఓ ఎమ్మెల్యేతో నేను మాట్లాడటం తప్పా? రాజకీయాల్లో మేం ఏదైనా చానెల్‌ను నిషేధించామా' అని రావత్‌ ఆదివారం డెహ్రాడూన్‌లో విలేకరులతో అన్నారు. రావత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎదురుతిరగడం, అసెంబ్లీలో బలపరీక్షకు ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశించడం, అంతకుముందే కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంతో దీనిపై రాష్ట్ర హైకోర్టు మండిపడటం.. తాజాగా సుప్రీం రాష్ట్రపతి పాలనపై స్టే విధించిన విషయం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarakhand political crisis  President Rule  Harish Rawat  sting CD  

Other Articles