shocking moment teen girl karate kicks hapless pickpocket in the face

Teenage girl floors handbag thief with perfectly timed karate kick

CCTV footage, Mobile phones, Teenagers, CCTV, Teenage girl, karate, karate kick, girl karate, girl karate kick, girl thief karate, viral video

The clumsy pickpocket was in for a shock when the girl turned around and punched him in the face

ITEMVIDEOS: చిల్లర దోంగకు యువతి జింతాత్తత్తా..!

Posted: 05/02/2016 01:54 PM IST
Teenage girl floors handbag thief with perfectly timed karate kick

బస్సులో పర్సు చోరీ చేయాలనుకున్న దొంగకి చుక్కలు చూపించింది ఓ యువతి. అది ఎంతలా అంటే ఇక జీవితంలో దొంగతనం చేయాలంటే కూడా భయపడేలా. మామూలుగా అయితే అమ్మాయిలు సెల్ ఫోన్ లో పడితే ప్రపంచాన్ని మర్చిపోతారనుకున్నా దొంగ.. మహా అయితే వారికన్నా గొంతు ఎక్కవగా చేసి జారుకోవచ్చని అనుకున్నాడు. అయితే అలా అలోచించడం తప్పని ఆనక తెలుసుకున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రద్దీగా ఉన్న బస్సులో ఓ యువతి తన ఫోన్తో బిజిగా ఉంది. అదే సరైన సమయంగా బావించి హ్యాండ్ బ్యాగ్ లక్ష్యంగా చేసుకొని ఓ దొంగ చోరీ చేయడానికి ప్రయత్నించాడు.

కానీ, అంతలోనే బస్సు స్టాప్ రావడంతో కొందరు ప్రయాణికులు దిగిపోయారు. దీంతో బస్సులో కొంత ఖాళీ ఏర్పడింది. అయినాసరే తనపని తనదనుకున్న ఆ దొంగ తన ప్రయత్నాలను విరమించుకోలేదు. సెల్ ఫోన్ లో నిమగ్నమైన ఆ యువతి హ్యాండ్ బ్యాగ్ ను టార్గెట్ చేసుకున్నాడు. సరిగ్గా హ్యాండ్ బ్యాగ్ లో చేయి పెట్టే సమయంలోనే యువతి గమనించి.. ఏయ్ ఏం చేస్తున్నావ్ అన్నట్లుగా అరిచింది.. అందిరిని పిలవడానికి ప్రయత్నించింది.

అంతలోనే తనేం చేయలేదని బుకాయించాడు అ దోంగ. అంతేకాదు అమె కన్నా పెద్దగా గోంతేసుకుని అరవడం ప్రారంభించాడు. ఇక సహనం కోల్పోయిన యువతి దొంగకు బస్సులోనే చుక్కులు చూపించింది. అదెలా అంటే అమె కరాటే నేర్చుకుంది. ఇకనేం దొంగకు తన విద్యను రుచి చూపించింది. సెకన్లలోనే అతన్ని కుప్పకూలేలా చేసింది. గట్టిగా ఒక్క తన్ను తంతే వెళ్లి బస్సు సీట్లో పడ్డాడు. అమ్మాయే కదా ఏం చేస్తుందిలే అని వారినే టార్గెట్ చేసే దొంగలకు ఈ వీడియో చూపించాలంటూ..సోషల్ మీడియాలో కామెంట్లమీద కామెంట్లు వస్తున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teenage girl  karate  karate kick  pickpocket  

Other Articles