‘I will always find you,’ man told woman he stalked for nearly a decade before Plano arrest

He stalked classmate from delhi to us for a decade

burglary of a habitation, collin county district attorney's office, jitender singh, stalking, trial, crime, criminal courts, mckinney, plano, California man, Los Angeles, Plano apartment, fraudulent use of information

A 32-year-old Indian-origin man has been sentenced to 19 years in prison in the US for stalking a woman from New Delhi to Texas for nearly a decade.

ప్రేమ కోసమై జైళ్లో పడనే.. పాపం.. భారతీయుడు

Posted: 04/30/2016 03:12 PM IST
He stalked classmate from delhi to us for a decade

ఓ అబ్బాయి... తన కళాశాలలోనే చదువుతున్న మరో అమ్మాయిని ప్రేమించాడు. తన ప్రేమను వ్యక్త పరిచాడు. కానీ అమ్మాయి అతడి ప్రేమను తిరస్కరించింది. అయినా పట్టు వదలకుండా పదేపదే ప్రపోజ్ చేశాడు. కట్ చేస్తే.. కళాశాల విద్య అయిపోయి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అయినా వదలకుండా అమెరికా వెళ్లి మరీ హింసించాడు.. చివరికి కటకటాల పాలయ్యాడు. ఇదేదీ సినిమా కథ కాదు. నిజంగానే జరిగిన రియల్ స్టోరీ..

2006వ సంవత్సరంలో ఢిల్లీలో కాలేజీ రోజుల్లో జితేందర్ సింగ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తన ప్రేమను తిరస్కరిచిందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 2007వ సంవత్సరంలో తన నుంచి దూరంగా అమెరికా పంపించేశారని ఆమె ఫ్యామిలీని హింసించడం ప్రారంభించాడు. పోలీసులు ఓ సారి వార్నింగ్ ఇచ్చి వదిలేసినా ఆగకుండా అమెరికా వెళ్లాడు. అమ్మాయిలా నకిలీ వివరాలు రూపొందించి న్యూయార్క్‌లో అమ్మాయి చదువుతున్న కాలేజీలోనే చదవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఆమెకు నకిలీ క్రెడిట్ కార్డులు తయారు చేసి వాటి ద్వారా మోసానికి పాల్పడ్డాడు.
 
ఆమె చదువు అయిపోయి 2011వ సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లిన సమయంలో ఆమెను ఫాలో అయ్యాడు. తద్వారా ఆమె అడ్రస్ సంపాదించి 2011నుంచి 2014 వరకూ ఫోన్ ద్వారా, సోషల్ నెట్‌వర్క్ సైట్స్ ద్వారా బెదిరించడం ప్రారంభించాడు. 2015వ సంవత్సరంలో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. డబ్బు, నగలు దొంగతనానికి పాల్పడ్డాడు. ఆమెపై అఘాయిత్యం చేయబోయే లోపు.. ఆమె అరుపులకు పక్కింటి వాళ్లు వచ్చి జితేందర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసుల దర్యాప్తులో జితేందర్ జిత్తులన్నీ బయటపడ్డాయి. అది చూసి పోలీసులే కాక న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపడ్డారు. దీంతో జితేందర్‌కు 19 సంవత్సరాల శిక్షను విధిస్తూ కొల్లిన్ కంట్రీ డిస్ట్రిక్ట్ అటార్నీ గ్రెజ్క విల్లీస్ తీర్పునిచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stalking  India  US  harassment  Indian-Origin Man  Crime  

Other Articles