get passport with in ten days

Get passport with in ten days

passport, Indian Passport, Aadhar, Aadhar Number, పాస్ పోర్ట్, ఇండియన్ పాస్ పోర్ట్

Govt of India offering passports with in ten. If u have Aadhar card number then you can apply online. After three days your passport will be examine

పది రోజుల్లో పాస్ పోర్ట్.. ఆధార్ ఉంటే చాలు

Posted: 04/30/2016 02:57 PM IST
Get passport with in ten days

పాస్ పోర్ట్ కావాలంటే నెలలకు నెలలు ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిందే.. పైగా పోలీస్ ఎంక్వైరీ అంటూ అదో తలనొప్పి ఉంటుంది. విదేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ వెళదామంటే స్వేదేశంలో పాస్ పోర్ట్ కష్టాలు మనల్ని వేధిస్తుంటాయి. కానీ ఇక మీదట అలాంటి పరిస్థితి ఉండదులెండి. ఎందకంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కొన్ని సంస్కరణల కారణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా  పోలీస్ వెరిఫికేషన్ లాంటివి ఏమీ లేకుండా డైరక్ట్ గా మీ ఇంటికి 10 రోజుల్లో పాస్‌పోర్ట్ వస్తుంది. తరువాత పోలీస్ వెరిఫికేషన్ కోసం వస్తారని ప్రభుత్వం చెబుతోంది. మరి అదెలాగో తెలుసా..?

దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో దరఖాస్తుదారు అపాయింట్మెంట్ పొందుతారు. మరొక ఏడు రోజుల్లో, పాస్‌పోర్ట్‌ని ప్రాసెస్ చేసి ఇంటికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత పోలీసు ధృవీకరణ కోసం ఇంటికి వస్తారు. పాస్ పోర్టు జారీల విషయంలో జరుగుతున్న ఆలస్యాన్ని అధిగమించడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం, ఇంటిలిజెన్స్ బ్యూరో విభాగంతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధార్ కార్డుని తప్పనిసరి చేసింది. అలా ఇచ్చిన ఆదార్ కార్డును నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తో అనుసందానిస్తారు. దీనిని అమలు చేసేందుకు యుఐడిఎఐతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్వయం చేసుకుంటుంది. ఇలా కేవలం పది రోజుల్లోనే పాస్ పోర్ట్ అందుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles