Centre Rejects Special Status to AP, Denies Amendments to Act

Ap doesn t need special status

Andhra Pradesh Reorganisation Act, lack of quorum, Haribhai Parthibhai Chaudhary, K V P Ramachandra Rao, K Keshava Rao, Parliamentary Affairs Mukhtar Abbas Naqvi, neethi ayog, special status, mekapati rajamohan reddy, shivaji

The proposed amendment to the Andhra Pradesh Reorganisation Act, 2014, that was introduced through Private Members' Bill in the Rajya Sabha on Friday, did not make any headway due to lack of the necessary quorum in the Upper House,

నీతి అయోగ్ ప్రత్యేక హోదా కల్పించాలని సూచించలేదు..

Posted: 04/29/2016 07:16 PM IST
Ap doesn t need special status

ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ఇన్నాళ్లు నాన్చుతూ వచ్చిన కేంద్రం ఎట్టకేలకు చేతులెత్తేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే.. తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన పలువురు అది సాథ్యం కాదన్న వార్తల నేపథ్యంలో ఏకంగా తిరుపతి నుంచి ఆత్పర్ఫాణలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి అలా రాష్ట్రవ్యాప్తంగా పలువరు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అసువులు బాసారు. తీవ్ర రూపం దాల్చుతున్న ప్రత్యేక డిమాండ్ పై నీతి అయోగ్ నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర తన చేతులెత్తేసింది.

నీతి అయోగ్ సూచిస్తే తాము అంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని కేంద్రం ప్రత్యేక హాదా భారాన్ని ఏకంగా నీతి అయోగ్ పై బెట్టింది, అయితే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని నీతి అయోగ్ సూచించలేదని కేంద్ర మంత్రి  హెచ్బీ చౌదరి తెలిపారు.  పన్ను రాయితీలు, కేంద్రం సాయం చేయాలని మాత్రమే సూచించిందని ఆయన అన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేరుస్తామని అన్నారు. అన్ని ఇస్తున్నప్పుడు ఇక ఏపీకి ప్రత్యేక హోదా అవసరమేంటని ఆయన ఎదురు ప్రశ్నించారు.

2018కల్లా పోలవరం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఐఐటీ, ఐఐఎంసహా 10 జాతీయ విద్యాసంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.2050 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ప్రత్యేక హాదా కావాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్ల ప్రకారం బిల్లులో ఉన్న అన్ని అంశాలను పరిశీలించి వాటికి కావాల్సిన నిధులను తాము సమకూరుస్తున్నామని కేంద్ర మంత్రి హెచ్ బి చౌదరి అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles